కొన్ని రాష్ట్రాలకు మద్యం మంచి ఆదాయవనరుగా మారింది. గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మద్య రాష్ట్రాలకు ఆదాయం తీసుకు వస్తున్నప్పటికీ కుటుంబాల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి.
పోలీస్ అంటే రక్షణ కల్పించేవారు.. కానీ ఇటీవల పలు సందర్భాల్లో పోలీసులు చేస్తున్న చర్యలపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కానీ ఓ పోలీస్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై చాలాకాలంగా ఎన్నో పుకార్లు వచ్చాయి. సొంత కుటుంబాన్నే దూరం పెడుతున్నాడు అంటూ కామెంట్ చేశారు. అయితే అలాంటి రూమర్స్ కు పూరీ జగన్నాథ్ చెక్ పెట్టారు. చాలాకాలం తర్వాత తమ కుటుంబంతో కలిసి సందడి చేశాడు.
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
కన్న కొడుకు ప్రయోజకుడు అయ్యి.. ఉన్నత స్థానంలో ఉంటే.. అంతకు మించి ఓ తల్లికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. పైగా తన కొడుకు దేశం గర్వించే స్థాయికి ఎదిగితే ఆ తల్లికి అంతకన్నా పుత్రోత్సాహాం మరోటి ఉండదు. ప్రస్తుతం అలాంటి పుత్రోత్సాహాన్నే పొందుతోంది మహ్మద్ సిరాజ్ తల్లి. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్. […]
అంతుచిక్కని వ్యాధి ఆ కుటుంబంతో రాక్షస క్రీడ ఆడింది. ఒకరి తర్వాత ఒకరిని బలి తీసుకుంది. దాదాపు 40 రోజుల వ్యవధిలో ఓ కుటుంబం మొత్తం బలైపోయింది. భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. కొన్ని నెలల ముందు వరకు ఎంతో కలకల్లాడిన కుటుంబం ఇప్పుడు విలవిలబోతోంది. కుటుంబాన్ని మొత్తం నాశనం చేసిన ఆ వ్యాధి ఏంటో అర్థం కాక ఇటు డాక్టర్లు తలలు పట్టుకుంటుంటే.. అటు సామాన్య జనాలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. […]
ఇల్లు ఊడుస్తూ, అంట్లు తోముతూ, వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ ఇలా అన్ని పనులూ చేసి పెట్టే పని మనుషులు ధనవంతుల ఇళ్లలో ఉండడం అనేది మామూలే. చాలా మంది తమ ఇళ్లలో పనిచేసే పనిమనిషిని పనిమనిషిగానే చూస్తారు. కానీ వారి పని విలువ తెలిసిన కొందరు మాత్రం పని తెలిసిన మనిషిగా చూస్తారు. అలా చూసినప్పుడు ఆమెను తమ మనిషిగా గుర్తిస్తారు. అలా గుర్తించినప్పుడు తమ ఇంట్లో సభ్యులని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో.. […]
పూరీ జగన్నాథ్.. టాలీవుడ్‌లోనే కాకుండా లైగర్ సినిమాతో ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా.. తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమా వైఫల్యంపై అటు పూరీ జగన్నాథ్, ఇటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. పూరీ అయితే సినిమా ఫ్లాప్ అని తెలియగానే జిమ్‌కి వెళ్లి బాగా వర్కౌట్ చేసి ఆ స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకున్నాని చెప్పుకొచ్చాడు. ఇంక రౌడీ హీరో అయితే ఈ సినిమాపై అంచనాలు […]
Mahesh Babu: సాధారణంగా అభిమాన సినీతారలకు సంబంధించి కొత్తగా ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులలో కనిపించే సందడి వేరు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా అబ్బాయిలతో పాటు కోట్లాది లేడీ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతుంటారు. సర్కారు వారి పాట విజయం తర్వాత ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్న మహేష్ బాబు.. తాజాగా ఓ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. అందులో మహేష్ ఫ్యామిలీతో పాటు మహేష్ […]
Whatsapp Photo : 19 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదలిపెట్టి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. వాట్సాప్ మెసేజ్ కారణంగా మళ్లీ కుటుంబంతో కలిశాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన ఫొటో మెసేజ్ ఆధారంగా తండ్రిని కనుక్కున్నాడు అతడి కొడుకు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా, కోవూరు గమళ్ల పాళానికి చెందిన బండ్ల సురేష్‌కు 2004లో వివాహం అయింది. వివాహం జరిగిన కొన్నిరోజులకే సురేష్ తండ్రి సుబ్బారావు కనిపించకుండా పోయాడు. తండ్రి జాడకోసం […]