మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో అతని వ్యక్తిగత వివరాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం కంపెనీ మహిళా ఉద్యోగితో బిల్‌గేట్స్ నెరిపిన అక్రమ సంబంధం తాజాగా చర్చనీయాంశమైంది. రెండేళ్ల క్రితమే కంపెనీ దృష్టికొచ్చిన ఈ వ్యవహారంపై దర్యాప్తు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తికాకముందే మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ తప్పుకోవడం కొసమెరుపు. బిల్ గేట్స్ ఆ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి మధ్య ఉన్న సంబంధంపై మైక్రోసాఫ్ట్ […]