హాయిగా నిద్ర పట్టడం కూడా ఓ వరం. కొంత మందికి ఇలా కునుకు తీయగానే..అలా నిద్ర పట్టేస్తుంది. మరికొంత మందికి లైటు వెలుతురు పడినా, చిన్న సౌండ్స్ వినిపించినా నిద్ర పట్టదు.
హాయిగా నిద్ర పట్టడం కూడా ఓ వరం. కొంత మందికి ఇలా కునుకు తీయగానే..అలా నిద్ర పట్టేస్తుంది. మరికొంత మందికి లైటు వెలుతురు పడినా, చిన్న సౌండ్స్ వినిపించినా నిద్ర పట్టదు. ఇక మరికొంత మంది అయితే నిద్రలో నడిచే అలవాట్లు, ఉలిక్కిపడటం, మత్తుగా నిద్రపోవడం, గురక పెద్దగా తీయడం వంటి లక్షణాలు ఉంటాయి. మిగిలిన వాటి వల్ల పెద్ద నష్టం ఉండదు కానీ.. నిద్రలో నడిచే అలవాట్లు ఉంటే మాత్రం.. ప్రమాదమే. ఎందుకంటే.. ఎటు వెళుతున్నామో, ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా నడిచేస్తుంటారు. దీని వల్ల నిద్రలో నడిచే వ్యక్తుల ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి అయితే ఏకంగా నిద్రలో నడిచి.. గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు.
నిద్రలో ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించేశాడట అతడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు పంచుకుంది. 36 సంవత్సరాల క్రితం ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 1987 ఏప్రిల్ 6న 11 ఏళ్ల మైఖేల్ డిక్సన్ అనే బాలుడు అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతూ కనిపించాడట. చెప్పులు లేకుండా ఫైజమా ధరించి కనిపించేవాడట. తీరా చూస్తే అతడు నిద్రలో నడుస్తున్నట్లు గుర్తించారు. ఇల్లినాయిస్ లోని డాన్ విల్లేలో తన మంచంలో నిద్రపోయిన వ్యక్తి.. నిద్రలోనే నడుచుకుంటూ.. 160 కిమీ ప్రయాణించాడు. ఇంటికి సమీపంలోని స్టేషన్ నుండి రైలుఎక్కి అర్థ రాత్రి మొత్తం ప్రయాణించాడు.
అయితే ఇవన్నీ అతడు నిద్రలో చేస్తుండటం వల్ల అతడికి ఇంత దూరం ప్రయాణించినట్లు తెలియదు.అయితే అతడికి నిద్రలో నడిచే అలవాటు ఉందని, అయితే అతడు ఎప్పుడూ కూడా బయటకు వెళ్లలేదని తల్లి చెప్పారట. రాత్రి 10 గంటలకు చూసిన కుమారుడు.. కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు సాయంత్రం అతడిని తల్లికి అప్పగించారు. ఈ వింత కేసును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఖాతాలో నమోదు చేసుకోవడమే కాదు ఈ స్టోరీని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలా అతడు నిద్రలో నడుస్తూ 160 కిలోమీటర్లు ప్రయాణించి.. గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాడు.
Our 1989 edition of Guinness World Records featured the story of Michael Dixon, who managed to sleepwalk onto a freight train and end up 100 miles from home.https://t.co/vs1x9L4F7d
— Guinness World Records (@GWR) August 22, 2023