గ్రౌండ్ లోనే కోహ్లీ-గంభీర్ గొడవపడ్డారు. దీంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ వాళ్లిద్దరికీ చెరో 100 శాతం మ్యాచ్ ఫీజ్ కోత విధించింది. ఇలా అంతా ఓకే. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? అయితే ఇది చదివేయండి.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ-గంభీర్.. తీవ్రస్థాయిలో గొడవపడ్డారని అందరికీ తెలుసు. మంగళవారం అంతా కూడా క్రికెట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ దీని గురించి తెగ డిస్కస్ చేసుకున్నారు. ఈ ఇద్దరి గురించి తెలిసిన ఎవరికైనా సరే ఇదేం కొత్త అనిపించదు. ఎందుకంటే 2013లో ఇదే టోర్నీలో కేకేఆర్ కెప్టెన్ గా గంభీర్, ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ ఇంతకు మించి గొడవపడ్డారు. అప్పటినుంచి వీళ్ల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. తాజా గొడవ గురించి ఇప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి. ఏం మాట్లాడుకున్నారనేది బయటకొచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ఐపీఎల్ లో కొన్నిరోజుల ముందు చిన్నస్వామి స్టేడయంలో బెంగళూరు-లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. సొంతమైదానంలో ఆర్సీబీని లక్నో జట్టు ఓడించడంతో స్టేడియంలో ఫ్యాన్స్ గోలగోల చేశారు. వాళ్లని నోరు మూసుకోమన్నట్లు లక్నో మెంటార్ అయిన గంభీర్.. సైగ చేసి వేలు చూపించాడు. ఆ మ్యాచ్ లో లక్నో ప్లేయర్లు కూడా కాస్త శ్రుతిమించారు. వాటిని గుర్తుపెట్టుకున్న కోహ్లీ.. తాజాగా లక్నోతో మ్యాచ్ గెలిచిన తర్వాత తిరిగిచ్చేశాడు. దీంతో గొడవ స్టార్టయింది. నవీన్ తో ఫస్ట్ గొడవపెట్టుకున్న కోహ్లీ.. చివరకు గంభీర్ దగ్గరకు వచ్చి ఆగాడు.
ఇప్పుడు గొడవ సందర్భంగా కోహ్లీ-గంభీర్ ఏమేం తిట్టుకున్నారు లేదా మాట్లాడుకున్నారనేది బయటపడింది. ‘ఏం అంటున్నావ్?’ అని గంభీర్ అనగానే.. ‘అసలు సంబంధం లేని విషయంలోకి మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావ్?’ అని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. ‘నువ్వు నా టీమ్ ప్లేయర్ ని తిట్టావ్ అంటే నా ఫ్యామిలీని తిట్టినట్లే’ అని గంభీర్ రిటర్న్ కౌంటర్ ఇచ్చాడు. ‘అయితే నీ ఫ్యామిలీని ముందు నువ్వు చక్కగా చూస్కో’ అని కోహ్లీ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వీటిని బయటపెట్టింది. వీడియో చూస్తుంటే.. ఈ మాటలన్నీ నిజమే అనిపిస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే గంభీర్-కోహ్లీ గొడవపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Conversation between Virat Kohli and Gautam Gambhir. (Reported by TOI). pic.twitter.com/ClGxkDeiQQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2023
kohli, gambhir, kohli fight, rcb vs lsg