కోహ్లీతో గొడవని ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకని లక్నో అనుకున్నట్లు ఉంది. అందుకే ఫైనల్ గా కాంప్రమైజ్ కి వచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ ట్వీట్ చేసింది.
భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.
ఆటల్లో వివాదాలు జరుగుతుండటం కామనే. కానీ గేమ్ కంటే కాంట్రవర్సీలు హైలైట్ అవడం ఎంతమాత్రం మంచిది కాదు. వివాదాలకు ఎండ్ కార్డ్ పడి.. ఆటపై ఫోకస్ పెంచాలి. కానీ ఈ వివాదాలను ఆటగాళ్లు లైట్ తీసుకున్నా.. వారి ఫ్యాన్స్ మాత్రం అస్సలు వదలమని అంటున్నారు.
విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవను ఆధారంగా చేసుకొని, ఓ అనామక కోడర్ వీరిద్దరిపై వీడియో గేమ్‌ను రూపొందించాడు. ఈ గేమ్‌లో కోహ్లీ ఓటమిపాలవ్వడం గమనార్హం.
ఆటల్లో అగ్రెషన్ కామన్. క్రికెట్లో కూడా ఎంతో మంది ప్లేయర్లు అగ్రెషన్‌ను చూపిస్తుంటారు. అయితే టీమిండియా మాత్రం ఇందుకు కాస్త విభిన్నం. సచిన్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ఎందరో ప్లేయర్లు గ్రౌండ్లో ఎంతో హుందాగా నడుచుకున్నారు. అదే టైమ్‌లో సౌరవ్ గంగూలీ, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు అగ్రెషన్‌ను చూపడంలో అస్సలు వెనుకాడలేదు.
కోహ్లీ ఆ గొడవని ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. గంభీర్ ని మళ్లీ కెలికాడు. ఆ ఒక్క పనిచేసి ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్ వివాదంపై క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా ఈ కాంట్రవర్సీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
Gautam Gambhir, Virat Kohli: కోహ్లీ-గంభీర్ వివాదంలో మరో సంచలన వ్యాఖ్య వెలువడింది. కోహ్లీని చూసి గంభీర్ ఓర్వలేకపోతున్నాడని, అతనికి కోహ్లీ అంటే కుళ్లు అంటూ ఓ ప్రముఖ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.