ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక జట్టే ఐపీఎల్లో ఉండేది. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఫ్రాంచైజీకి తెలుగు ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే ఇకపై ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు.
లీగ్ క్రికెట్‌కు ప్రేక్షకుల్లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ఆరంభమైన లీగ్ క్రికెట్ హవా ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. బిగ్‌బాష్, పీఎస్ఎల్, బీపీఎల్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నయా లీగ్‌లు పుట్టుకొచ్చేశాయి. త్వరలో సౌదీ గడ్డపై రిచెస్ట్ క్రికెట్ లీగ్ నిర్వహణకు ప్లాన్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇక, ఎన్ని లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ కిందకే అని చెప్పాలి. దాదాపుగా 15 సంవత్సరాలుగా ఈ లీగ్ అత్యంత విజయవంతంగా రన్ అవుతోంది. అలాంటి ఈ లీగ్‌లోకి గతేడాది రెండు కొత్త జట్లు వచ్చాయి. ఐపీఎల్ పదిహేనో సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే త్వరలో ఐపీఎల్‌లోకి మరో కొత్త టీమ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఏపీలో క్రికెట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మార్గనిర్దేశనం చేస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. ఫ్యూచర్లో ఎలాగైనా రాష్ట్రం నుంచి ఒక టీమ్ ఐపీఎల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ‘ఏపీలో మూడు క్రికెట్ గ్రౌండ్స్‌ను ట్రైనింగ్, ప్రాక్టీస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్‌కు అప్పగిస్తాం. అంబటి రాయుడు, కేఎస్ భరత్ వంటి వారు రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకం. క్రికెట్ టీమ్ తయారీకి వారి సేవల్ని వినియోగించుకోవాలి. చెన్నైతో పాటు ఫ్యూచర్లో ముంబై ఇండియన్స్ లాంటి జట్ల సాయం కూడా తీసుకుంటాం. దీని వల్ల ప్రొఫెషనలిజం మరింత పెరుగుతుంది’ అని సీఎం జగన్ చెప్పారు. మరి.. ఏపీ నుంచి ఒక జట్టు ఐపీఎల్లో ఉంటే బాగుంటుందని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.