స్కూల్ , కాలేజీ, స్టేట్ ఫస్ట్ వచ్చిన వారికి కటౌట్స్ కడుతుంటారు. అలానే వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఓ వ్యక్తికి మాత్రం 35 శాతం తో ఇంటర్ పాసైనందుకు ఫ్లైక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఈ కటౌట్ హాట్ టాపిక్ గా మారింది.
స్కూల్ , కాలేజీ, స్టేట్ ఫస్ట్ వచ్చిన వారికి కటౌట్స్ కడుతుంటారు. అలానే వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అయితే ఓ యువకుడి కూడా…అతడి స్నేహితులు కటౌట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్లు ఇలాంటి వాటికి కూడా కటౌట్ ఏర్పాటు చేస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతకి అందులో ఏముందనే సందేహం మీకు రావచ్చు. 6వ ప్రయత్నంలో 35 శాతం మార్కులతో ఓ యువకుడు ఇంటర్ పాసయ్యాడు. దీంతో అతడి స్నేహితులు కాలర్ ఎగరేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రానికి చెందిన నితిన్ అనే యువకుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఆరోవసారి 35 మార్కులతో పాసయ్యాడు. ఈ సందర్భంగా నితిన్ కి అతడి ఫ్రెండ్స్ అతడికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అందరికి తెలిసేలా నితిన్ ఫోటోతో కటౌట్ ఏర్పాటు చేశారు. అంతేకాక 35.83 శాతంలో 83 ను హైలెట్ చేస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అంతేకాక మా వాడు ఎంత ఘనుడో చూడండి అంటూ ఆరో సారి చేసిన ప్రయత్నం అని కూడా ఆ కటౌట్ లో చూపించారు. ఆరు సారి కూడా భారీ మార్కులు వచ్చాయా అంటే.. కేవలం పాస్ మార్కులతో తల్లిదండ్రులను తలెత్తుకునే చేశాడు.
విద్యార్థులు పరీక్షలు రాసి ఫెయిల్ కావడం చాలా సాధారణం. మార్చి పోతే మే అన్నట్లు దండయాత్రల మీద, దండయాత్రలు సాగిస్తుంటారు. అయితే ఇలా 6 సార్లు ఇంటర్ పరీక్షలు రాసి.. అది కూడా బార్డర్ మార్కులతో పాస్ కావడంతో అతడి స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడి మీద అభిమానం కంటే.. పరువు తీయాలని గట్టిగా అనుకున్నట్లు ఉన్నారు. స్నేహితుడు ప్లెక్సీ వేయడమే కాకుండా అందులో ఎన్నో ప్రయత్నంలో పాసయ్యాడు.
ఎన్ని మార్కులతో, ఎంత శాతంతో పాసయ్యాడు వంటి వివరాలు మొత్తం రాశారు. ఇక వీరి ఉత్సాహం చూస్తుంటే పెద్ద పార్టీ ఏర్పాటు చేసిన చేయవచ్చని ఈ వార్త చూసిన నెటిజన్లు అభిప్రాయా పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషళ్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడి మగాడు రా బుజ్జి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వెరైటీ ఫ్లెక్సీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.