వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు వారం రోజులు పడ్డ కష్టం ఒక్కరోజు మర్చిపోవాలని అనుకుంటారు ప్రతిఒక్కరు. కొంతమంది ఎంజాయ్ కోసం సినిమాలు, షాపింగ్ మాల్స్ వెళ్లడం చేస్తారు. కొంతమంది కుటుంబంతో మంచి రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు.
నగరాల్లో ఉన్న వారు వీక్ ఎండ్ వచ్చిందంటే విహార యాత్రలు, రెస్టారెంట్స్, సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్స్ కి వెళ్లి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తృప్తిగా తిని వస్తుంటారు. బిల్లు కాస్త ఎక్కువైనా సరే తమకు నచ్చిన ఫుడ్ ఆరగించి వస్తుంటారు. పెద్ద పెద్ద హూటల్స్, రెస్టారెంట్స్ లో వెయిటర్స్ కి తమకు నచ్చిన టిప్స్ ఇస్తూ సంతోషపరుస్తుంటారు. ఓ రెస్టారెంట్ లో కుటుంబం తృప్తిగా భోజనం చేసి.. తర్వాత హూటల్ సిబ్బందితో గొడవ పెట్టుకొని కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లో నోయిడా ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ కి ఓ కుటుంబం భోజనం చేయడానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం దాదాపు పదమూడు మంది కుటుంబ సభ్యులు డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లారు. తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తృప్తిగా తిన్నారు. ఇక రెస్టారెంట్ సిబ్బంది బిల్లు ఇచ్చారు.. అంతే బిల్లు చూసిన కుటుంబ సభ్యులు కన్నెర్రజేశారు. ఎందుకంటే ఆ బిల్లులో రూ.970 సర్వీస్ ఛార్జ్ విధించారు. ఇదేంటీ అని ఆ కుటుంబ సభ్యుల ప్రశ్నించడంతో ఇక్కడ ఇలాగే ఉంటుందని రెస్టారెంట్ సిబ్బంది అనడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులు బిల్లు నుంచి అంత సర్వీస్ ఛార్జీ తీసివేయాలని రెస్టారెంట్ సిబ్బంది కోరారు. కానీ స్టారెంట్ యాజమాన్యం ససేమిరా అన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత ఇరువర్గాల మాటా మాటా పెరిగిపోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తిట్టుకుంటూ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ కొట్టుకున్నారు. ఇరు పక్షాలవారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఈ ఘర్షణలో ఆడవారు కూడా ఉన్నారు. కాగా, ఈ తతంగాన్ని అక్కడ ఉన్నకొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెస్టారెంట్ గొడవపై పోలీస్లు కేసు నమోదు చేసుకున్నారు. తప్పు ఎవరిదో తెల్చి అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ये वीडियो है नोएडा के स्पेक्ट्रम मॉल की जहां “ड्यूटी फ्री रेस्टोरेंट” में सर्विस चार्ज के 970 रुपयों को लेकर कस्टमर्स और स्टाफ में जमकर मारपीट हुई। pic.twitter.com/soiP0X4oGd
— Priya singh (@priyarajputlive) June 19, 2023