ప్లాస్టిక్ ఆవిష్కరణ ప్రారంభమైన తొలి నాళ్లలో ఇది మానవ జీవితాల్ని మరింత సులభతరం చేసే అత్యద్భుతమైన ఆవిష్కరణ అని పొగిడారు. కానీ రాను రాను దాని వల్ల తలెత్తే సమస్యలు తెలిసిన కొద్ది… మానవాళి మొత్తం బెంబెలెత్తిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూతం నీరు, భూమి ఇలా ఎక్కడా కరగదు. కాల్చితే.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. భూమ్మీద అసలు ప్లాస్టిక్ చేరని ప్రదేశం అంటూ ఏది లేనంతగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు. తొలిసారిగా వీటి ఆనవాళ్లను మానవ రక్తంలో గుర్తించారు. ఇది చాలా ఆందోళనకరమైని.. వెంటనే దిదుబాటు చర్యలు చేపట్టకపోతే.. మానవాళికి పెను ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: సముద్ర గర్భంలోనూ ప్లాస్టిక్ భూతాన్ని చూసిన సాహసిక శాస్త్రవేత్త!.
భూమ్మీద కాలుష్యకారకాల్లో ప్రధానమైంది ప్లాస్టిక్. ఈ వ్యర్థాలు భారీ పరిమాణంలో నేల నుంచి సముద్రంలోకి చేరుతున్నాయి. వీటిలో ఉండే చిన్నపాటి సూక్ష్మ రేణువులను మైక్రోప్లాస్ట్ అంటారు. గతంలో ఇవి పేగులు వంటి అవయవాల్లో కనిపించాయి. చేపలు, ఇతర మత్స్య సంపదలో వెలుగు చూశాయి. కానీ తొలిసారిగా ఇవి ఇప్పుడు మనిషి రక్తంలోనూ కనిపించి ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పేపర్ కప్పులతో అనేక వ్యాధులు – తేల్చేసిన ఆరోగ్య నిపుణులు.!!
నెదర్లాండ్స్‌లోని పరిశోధకులు 22 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించగా.. 17 మంది శాంపిళ్లలో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. సగం మంది శాంపిళ్లలో పాలీఇథలీన్ టెరెప్టథలేట్ రేణువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని వాటర్ బాటిల్స్ తయారీలో వాడుతుంటారు. ఆహార ప్యాకేజింగ్‌లో వాడే పాలీస్టరిన్ రేణువులు 36 శాతం శాంపిళ్లలో కనిపించాయి. ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే పాలీఇథలీన్ రేణువులు 23 శాతం నమూనాల్లో వెలుగు చూశాయి.
ఇది కూడా చదవండి: కోడిగుడ్లు కూడా కల్తీనా?.. ఎలా … ఎక్కడా!?.
గాలీ, ఆహారం, పానీయాల ద్వారా ఇవి మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. కనుక వీటి బారి నుంచి తప్పతించుకోవాలంటే.. ఇళ్లల్లో మంచి వెంటిలేషన్ ఉండాలని శాస్త్రవ్తేతలు తెలిపారు. ఆరుబయట కన్నా.. ఇవి ఇళ్లల్లోనే ఎక్కువగా పేరుకుపోతున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాము పరిశీలించిన రక్తంలో 1.6 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి రక్త ప్రవాహం ద్వారా శరీరం మొత్తం రవాణా అవుతాయని.. అవయవాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి