కోడిగుడ్లు కూడా కల్తీనా?.. ఎలా … ఎక్కడా!?.

కాదేదీ కల్తీకి, నకిలీకి అనర్హం అని తేల్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. ఏకంగా కోడిగుడ్లనే కృత్రిమ కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రా వారి పల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టంది. ఎంతకీ కోడిగుడ్లు ఉడకక పోవడంతో, అనుమానం వచ్చిన మహిళ, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గుడ్డును చూపించింది.

Eggs minజిల్లాలోని వరికుండపాడులో కొందరు వ్యక్తులు ఆటోల్లో తీసుకొచ్చి కోడిగుడ్లు విక్రయించారు. 30 కోడిగుడ్ల ధర రూ.180 కాగా, తాము రూ.130కి విక్రయిస్తున్నట్టు చెప్పడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు. వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో  ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. దీంతో ఆ గుడ్డు నకిలీదని తేలింది.

కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కోడి గుడ్లు కొనుగోలు చేశామని, వండుతామంటే దుర్గధంతో పాటు గుడ్లు సాగడం, రంగుమారడం లాంటివి చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.  మామూలు కోడిగుడ్డుకంటే భిన్నంగా ఉండటం, ఉడకకపోవడం, పగలకపోవడంతో ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు.

నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.