ఈ రోజుల్లో ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకమై తమకున్న ఆస్తుల్ని, వారి కుటుంబసభ్యులను కూడా వదులకోవడానికి సిద్దపడుతున్నారు. నిజమైన ప్రేమ ఆస్తులు, అంతస్తులు చూడదని నిరూపిస్తున్నారు. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు ఉన్నాయి.
ఇంతకు ముందైతే.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. పేరెంట్స్ చెప్పిన అమ్మయిలను, అబ్బాయిలను పెళ్లి చేసుకునేవారు. ఈ రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా తగ్గిపోయాయి. ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ప్రేమించి తనకు నచ్చిన వారిని జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో పెద్దలు ఒప్పుకోనివారు కూడా ఉన్నారు. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకమై తమకున్న ఆస్తుల్ని, వారి కుటుంబసభ్యులను కూడా వదులకోవడానికి సిద్దపడుతున్నారు.
నిజమైన ప్రేమ ఆస్తులు, అంతస్తులు చూడదని నిరూపిస్తున్నారు. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు ఉన్నాయి. తెలుగు సినిమా మల్లీశ్వరి మూవీలో కూడా హీరోయిన్ తన కోట్ల ఆస్తిని వదులుకుని హీరో వెంకటేష్‌ని చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అలాంటిదే నిజంగా బయట కూడా జరిగింది. ఓ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తి కోసం తనకు ఉన్న కోట్ల ఆస్తిని వదిలేసింది. ప్రియుడి కోసం తనకు వారసత్వంగా వచ్చే వేల కోట్ల రూపాయలను వదులుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలేషియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛాయా దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఏంజెలిన్. ఏంజెలిన్ ఉన్నత చదువుల కొరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది.
ఆ సమయంలో ఏంజెలిన్‌కు జెడిడియా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత వారిరువురు ప్రేమించుకున్నారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఏంజెలిన్ తన పేరెంట్స్‌కి తెలియజేసింది. ఏంజెలిన్ తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు. పైగా అతన్ని పెళ్లి చేసుకుంటే ఏంజెలిన్‌కు రావలసిన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఏంజిలిన్ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదని చెప్పి, ప్రేమించిన జెడిడియాతోనే జీవిస్తానని వెళ్లిపోయింది. సుమారు. రూ.2,484 కోట్ల ఆస్తిని వదులకుని ప్రియుడిని 2008 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ రోజుల్లో మనుషులకంటె ఆస్తికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఆస్తిని కాదని అతన్ని వివాహం చేసుకున్నందుకు ఇద్దరు సంతోషంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.