సముద్ర గర్భంలోనూ ప్లాస్టిక్ భూతాన్ని చూసిన సాహసిక శాస్త్రవేత్త!.

వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటిపై జరుగుతున్న చర్చల్లో ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును. ఇవి అత్యంత అందంగాను, రంగురంగులతో వుండి అత్యంత చౌకగా వుండటంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువంటూ ఏది లేదు. స్వతహాగా ప్రాస్టిక్ విష పూరితము కాదు, ఆరోగ్యానికి హాని కరము అంతకన్నా కాదు. కాని వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు. భూమిపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్​ వ్యర్థాలు కనిపిస్తుంటాయి.  భూమి మీదే కాదు ఆఖరికి సముద్రపు నీటిలోనూ ప్లాస్టిక్​ వ్యర్థాలు బయటపడుతున్నాయి. దీంతో సముద్ర జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి ఏడాది సుమారు 8 మిలియన్​ మెట్రిక్​ టన్నుల ప్లాస్టిక్​ సముద్రంలోకి వెళ్తుందని అంచనా. ఫిలిప్పీన్స్ మెరైన్ సైన్స్ ఇన్​స్టిట్యూట్​కు చెందిన మైక్రోబయాల్​ ఓషియనాలజిస్ట్​ డాక్టర్ డియో ఫ్లోరెన్స్ ఒండా సముద్రంలోని 10,000 మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు.  అక్కడ కనబడ్డ దృశ్యం షాక్ కి గురిచేసిందట.

20210323 Dr. Onda 620x465 1ఒండా ప్రపంచంలోని అతి పురాతనమైన, భూమి మీద మూడవ లోతైన సముద్రం. ఇప్పుటి వరకు ఎవరూ ఈ ప్రదేశాన్ని సందర్శించలేదు. దీంతో ఈ మహా సముద్రాన్ని అన్వేషించిన మొదటి శాస్త్రవేత్తగా డాక్టర్​ ఒండా  రికార్డు సృష్టించాడు. సముద్రపు లోతుల్లో కేవలం ప్లాస్టిక్​ మాత్రమే కాదు బట్టలు, పాత బొమ్మలు, ప్యాకేజింగ్ వస్తువులు, ప్లాస్టిక్ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకుపోయిందని డాక్టర్​ ఓండా తెలిపారు. ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం ద్వారా అది చివరకు సముద్రంలోకి చేరి ఇలా జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అందువల్ల, ప్లాస్టిక్​ వ్యర్థాల వాడకాన్ని తగ్గించాలని ఆయన కోరారు.