16 రూపాయలకే టికెట్ బుక్ చేసుకోవచ్చు. లక్కీ విన్నర్ లక్ష రూపాయల జాక్ పాట్ కొట్టచ్చు. బస్సు ఆలస్యమైనా, క్యాన్సిల్ అయినా టికెట్ డబ్బులతో పాటు అదనంగా 50 శాతం వరకూ పొందవచ్చు. ఈ ప్రయోజనాలు, ఆఫర్లు ఇస్తున్న కంపెనీ ఏదంటే?
ఆన్ లైన్ సర్వీసులు వచ్చాక అందరూ టికెట్లు ఆయా కంపెనీలకు చెందిన యాప్స్ లోనే బుక్ చేసుకుంటున్నారు. లేదా ఆయా కంపెనీలు అందించే సర్వీసుల ద్వారా పేటీఎం వంటి వాటి ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ఇలా బుక్ చేసుకునే క్రమంలో క్యాష్ బ్యాక్ లు, డిస్కౌంట్లు పొందుతున్నారు. అయితే కొన్ని సంస్థలు వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను పెడుతుంటాయి. తాజాగా అభి బస్ కూడా తమ ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను, ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 16వ వార్షికోత్సవం సందర్భంగా 16 రూపాయలకే బస్సు టికెట్ ను అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం మే 24 నుంచి మే 31 వరకూ మాత్రమే ఉంటుంది.
ప్రస్తుతం అభి బస్ 16వ వార్షికోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో అభి బస్ సీఓఓ మీడియాతో మాట్లాడారు. హీరో మహేష్ బాబుని వరుసగా 6వ సంవత్సరం కూడా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్నామని అన్నారు. ఇక ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.. 16 రూపాయలకే బస్సు టికెట్ ని ఆఫర్ చేస్తున్నామని అన్నారు. 16 వేల మంది లక్కీ విన్నర్స్ కి 16 రూపాయలకే బస్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. ఈ అవకాశం మే 24 నుంచి ఈ నెలాఖరు వరకూ మాత్రమే ఉంటుందని అన్నారు. గత 16 సంవత్సరాలుగా తమ సేవలను నమ్ముకుని ప్రయాణించిన 16 వేల మంది లాయల్ కస్టమర్లకు ఈ అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఈ ఆఫర్ ను పొందలేని వారికి లక్ష రూపాయల జాక్ పాట్ కొట్టే అర్హతను పొందే అవకాశం ఉంటుందని.. అభి క్యాష్ వాలెట్ లో ఉన్న ప్రమోషనల్ అభి క్యాష్ ని వాడుకోవచ్చునని అన్నారు. అభి బస్ క్యాంపెయిన్ ముగిసిన అనంతరం లక్కీ విన్నర్ ని ప్రకటిస్తామని అన్నారు.
అలానే 16వ వార్షికోత్సవం సందర్భంగా అభి అస్యూర్డ్ సేవను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రయాణానికి ముందు బస్సు పార్ట్నర్ చేత బస్సు రద్దు అయితే 150 శాతం వరకూ బస్సు టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని కంపెనీ తెలిపింది. టికెట్ బుక్ చేసుకున్న దాని మీద అదనంగా 50 శాతం వరకూ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. పికప్ సమయం కన్నా 2 గంటలు లైన ఆలస్యం అయితే 100 శాతం వరకూ టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వబడుతుంది. అలానే బస్సు సర్వీస్ బాగోలేకపోయినా, నాణ్యత లేకపోయినా 100 శాతం వరకూ రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు బస్సు వచ్చే 6 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 100 శాతం వరకూ టికెట్ డబ్బులు రిఫండ్ పొందే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ప్రయోజనాలు, ఆఫర్లు పొందాలంటే టికెట్ బుక్ చేసుకునే ముందు అభి అస్యూర్డ్ ట్యాగ్ తో బస్సులను ఎంపిక చేసుకోవాలి.