నిత్యం ప్రయాణికుల రద్దీతో భారతీయ రైళ్లు ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అర్జెంటుగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టికెట్ బుక్ చేస్తే బుకింగ్ అవ్వడం చాలా కష్టం. మరి అలాంటి సమయాల్లో హెచ్ ఒ కోటా ద్వారా టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
నిత్యం ప్రయాణికుల రద్దీతో భారతీయ రైళ్లు ఎప్పుడు కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అర్జెంటుగా మనం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టికెట్ బుక్ చేస్తే బుకింగ్ అవ్వడం చాలా కష్టం. మరి అలాంటి సమయాల్లో హెచ్ ఒ కోటా ద్వారా టికెట్ కన్ఫామ్ చేసుకోవచ్చు. అదెలా అంటే..
ఏదైనా ముఖ్యమైన పనిమీద ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ట్రైన్ టికెట్ అప్పటికప్పుడు బుక్ అవ్వాలంటే సాధ్యపడదు. కనీసం నెల రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే బుక్ అయ్యే చాన్స్ ఉంటుంది. బుకింగ్ ఆలస్యంగా చేసుకుంటే టికెట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి. ఈ సమస్యను నుంచి బయటపడడానికి హెచ్ ఒ కోటా ఉపయోగపడుతుంది. హెచ్ ఒ కోటాను హై అఫీషియల్ కోటా అంటారు. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ట్రైన్ టికెట్లను సులభంగా కన్ఫామ్ చేసుకోవచ్చు.
హెచ్ ఒ కోటా అత్యవసర సమయాల్లో ప్రయాణించే వారికి, విఐపిలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా ఈ సదుపాయాన్ని టికెట్ బుకింగ్ చేసేటపుడు ఉపయోగించలేము. ప్రయాణికులు ముందుగానే సాధారణ వెయిటింగ్ లిస్ట్ తో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత హెడ్ క్వార్టర్ ద్వారా టికెట్ కన్ఫామ్ చేయాలి. అయితే జనరల్ కోటాతో బుక్ చేసిన టికెట్స్, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్లను హెచ్ఒ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. టికెట్ కన్ఫామ్ అనేది అధికారులు చార్ట్ తయారు చేసిన తరువాతే తెలుస్తుంది.
సాధారణ ప్రజలు కూడా హెచ్ఒ కోటా ద్వారా టికెట్లు కన్ఫామ్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ప్రయాణ తేదీకి ఒకరోజు ముందు రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి, అత్యవసరంగా ప్రయాణించడానికి గల కారణాన్ని చెప్తూ ఎమర్జెన్సీ కోటా ఫామ్ ను నింపాలి. దానిని ఛీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ కు సబ్మిట్ చేయాలి. హెచ్ఒ కోటా ద్వారా ట్రైన్ టికెట్ కన్ఫామ్ చేయాలని దరఖాస్తు రాసి, గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో సబ్మిట్ చేయాలి. ఈ సమాచారం రైల్వే డివిజనల్, జోనల్ కార్యాలయానికి పంపబడుతుంది. రైల్వే అధికారులు ఆమోదించిన తరువాత టికెట్ కన్ఫామ్ అవుతుంది. దీంతో మీరు హ్యాపీగా ట్రైన్ లో ప్రయాణించవచ్చు.