వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు వెళ్లాడానికి ప్లాన్ వేస్తారు. పిల్లలకు సెలవులు కావడంతో.. కుటుంబం అంతా కలిసి సరదాగా తిరిగి రావాలనుకుంటారు. ఈ క్రమంలో విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఓ బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు..
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పిల్లలకు సెలవులు. ఇన్ని రోజులు చదువుల ఒత్తిడిలో పడి.. ఇల్లు దాటకుండా ఇంటికే పరిమితమైన వారు.. వేసవిలో పర్యటనలు చేయాలనుకుంటారు. కుటుంబం అంతా కలిసి.. విహారయాత్రకు వెళ్లాలని భావిస్తారు. సమ్మర్‌లో ఎక్కువ మంది విహారయాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో.. హోటల్స్, గైడ్స్.. డిమాండ్‌కు తగ్గట్టుగా.. ధరలు పెంచేస్తారు. దాంతో మనం అనుకున్న బడ్జెట్ కాస్త పెరుగుతుంది. అలాంటి వారికి ఇండియన్ రైల్వేస్‌కు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ బడ్జెట్ ధరలోనే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే.. హోటల్ బుకింగ్, ప్రయాణం, దర్శనీయ స్థలాలు, గైడ్ ఇలా దేని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
ఇక దీనిలో భాగంగా ఐఆర్‌సీటీసీ థాయ్‌లాండ్ టూర్‌కు సంబంధించి బంపరాఫర్ ప్రకటించింది. ఒక్కరికి.. కేవలం 52 వేల రూపాయలకే.. థాయ్‌ల్యాండ్ వెళ్లి.. 6 రోజులు.. అనగా 6 పగళ్లు.. 5 రాత్రులు.. అక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు. మరి ఐఆర్‌సీటీసీ ఇంత తక్కువకే థాయ్‌ల్యాండ్ టూర్ ఆఫర్ ఎలా ప్రకటించగలిగింది.. అంటే.. ఐఆర్‌సీటీసీకి.. ఆయా దేశాల్లోని హోటల్స్, టూరిస్ట్ గైడ్స్, రెస్టారెంట్స్, ట్రావెల్ ఏజెన్సీలు వంటి వాటితో ముందే ఒప్పందాలు ఉంటాయి. అందువల్ల.. దీని ద్వారా బుక్ చేసుకుంటే.. తక్కువ ఖర్చులోనే విదేశాల్లో ఎంజాయ్ చేసి రావచ్చు.
ఐఆర్‌సీటీసీ థ్రిల్లింగ్ థాయ్‌లాండ్ పేరుతో ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రుళ్లు, 6 పగళ్లు ఉంటుంది. మొదటి ట్రిప్ ఏప్రిల్ 25 నుంచి బిహార్‌లోని పట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెళ్లాలనుకునేవారికి మళ్లీ మే 26న కోల్‌కతా నుంచి ప్యాకేజ్ అందుబాటులో ఉంది. చిన్న చిన్న మార్పులు తప్ప.. ఈ రెండు ప్యాకేజ్‌లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ ప్యాకేజ్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్స్ కోరల్ ద్వీపం, పట్టాయ, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను చుట్టి రావచ్చు. ఇక ప్యాకేజీలో భాగంగా.. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం అందుబాటులో ఉంటాయి. మరి ఐఆర్‌సీటీసీ అందిస్తోన్న ఈ ఆఫర్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.