పేపర్ కప్పులతో అనేక వ్యాధులు – తేల్చేసిన ఆరోగ్య నిపుణులు.!!

టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది.  రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే.  బయట టీ తాగేవారు ఇది గుర్తుంచు కోవాటని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంపై ప్లాస్టిక్ కప్పులు తీవ్ర స్థాయిలో సైడ్ ఎఫెక్ట్ కలిగిస్తాయని చెబుతున్నారు. త్వరగా అనారోగ్యానికి గురి చేస్తాయని చెబుతున్నారు. ఈ ముప్పు రెండు విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఒక్కసారి వాడి పడేసే వీలుండటంతో ప్లాస్టిక్ గ్లాసులకు ఆదరణ పెరిగింది. కానీ ఈ కప్పులోనే మనకు తెలియని విషం ఉంది.

tea cupsప్లాస్టిక్ కప్పులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కప్పులపై తరచుగా సూక్ష్మక్రిములు తిష్టవేసి ఉంటాయని, నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్లిపోతాయని అంటున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ, టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి  హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో లోపల ఓ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కారణంగా కప్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. దీంట్లోని రసాయనాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికి సైతం పలు విధాలా హాని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

హోటల్ యజమానులు, టీ పాయింట్ వర్తకులు కూడా థర్మాకోల్ కప్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  థర్మాకోల్ కప్పులు అయితే తాగిన తర్వాత కప్పును డస్ట్‌బిన్‌లో పడెయ్యవచ్చు. గాజు గ్లాసులో, పింగాణీ కప్పులో అయితే, టీ తాగిన తర్వాత వాటిని కడగాలి. అందుకు వాటర్ కావాలి. ఇంకో మనిషి కావాలి. ఇవన్నీ ఎందుకొచ్చిన సమస్యలు అనుకుంటున్న వారూ ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు.

ప్లాస్టిక్ కప్పులో వేడి నీరు – టీ – కాఫీలు పోస్తే అవి విష పదార్థాలుగా మారే అవకాశాలున్నాయి.  కొంత కాలం తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.