వినియోగదారులు ట్విట్టర్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే ఈ పద్ధతిని అనుసరించండి. ఈ సులువైన పద్ధతి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
ఇటీవల ట్విట్టర్ ద్వారా కూడా సంపాదించుకునే అవకాశం కల్పించింది. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (X) తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇండియాలోని యూజర్ల కోసం ఎలన్ మస్క్ మేనేజ్‌మెంట్ లోని కంపెనీ రీసెంట్‌గా యాడ్ రెవిన్యూ షేరింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ స్కీంలో భాగంగా ట్విట్టర్ నుంచి పొందిన పేమెంట్లను వినియోగదారులు గమనించవచ్చు. చాలామంది ఇండియన్స్ ట్విట్టర్ యూజర్లు ట్విట్టర్ నుంచి లక్షలు సంపాదించి సంతోషిస్తున్నారు. దీని కోసం మీరు కొన్ని షరతులు, నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. ఎలన్ మస్క్ యాడ్స్ రాబడి ప్రొగ్రామ్ లో అర్హత గల క్రియేటర్లు ప్లాట్ ఫామ్ ప్రకటనల నుండి సంపాదించిన దానిలో వాటాను పొందవచ్చు.
మీరు కూడా ట్విట్టర్ X నుంచి సంపాదించాలనుకుంటే దీని కోసం మీరు 500 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉండాలి. ఇది కాకుండా.. గత నెల్లో మీ అకౌంట్లో 15 మిలియన్ ఆర్గానిక్ ట్వీట్ ఇంప్రెషన్స్ ఉండాలి. ఈ నిబంధనలను పూర్తి చేస్తే.. మీరు ఎలన్ మస్క్ యాడ్స్ రాబడి ప్రొగ్రామ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీ ట్విట్టర్ అకౌంట్ను మోనటైజ్ చేయాలి. ఈ రోజుల్లో చాలామంది వినియోగదారులు ట్విట్టర్ ద్వారా తమ సంపాదన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. స్క్రీన్‌షాట్‌ల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ట్విట్టర్ నుంచి క్రియేటర్లు మనీ సంపాదిస్తున్నారు.
ట్విట్టర్ X సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలి. మనదేశంలో వెబ్ వినియోగదారులు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ. 650, మొబైల్ యూజర్లు రూ. 900 ప్లాన్ పొందుతున్నారు. మైక్రోబ్టాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సంవత్సర ప్లాన్ తీసుకునేందుకు ప్రతి సంవత్సరం రూ. 6,800 చెల్లించాలి. అదే విధంగా, ట్విట్టర్ X వార్షిక ప్లాన్ తీసుకుంటే నెలవారీ ప్లాన్ కంటె తక్కువగా పడుతుంది.
Blue tick ke paise vasool pic.twitter.com/pVrX5hTYWo
— Gabbar (@GabbbarSingh) August 8, 2023