మన చుట్టు పక్కల ఎవరికైనా నెలకు లక్ష రూపాయల జీతం అంటేనే.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతాం. అయితే టెక్ కంపెనీల పుణ్యమా అని.. ఏడాదికి కోట్లలో వేతనం అందుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్. దాని సీఈఓ అయిన టిమ్ కుక్ కు ఏడాది జీతం తెలిస్తే.. గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంతకు ఆయన ఏడాది జీతం ఎంతంటే.. అక్షరాల 734 కోట్ల రూపాయలకు పైమాటే. అంటే రోజుకు ఏకంగా 2 కోట్ల రూపాయల వేతనం అన్నమాట.
యాపిల్ టెక్ ప్రపంచంలో నంబర్ వన్ బ్రాండ్ గా ఉంటుంది. అంత పెద్ద టెక్ బ్రాండ్ కు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గా ఉన్న టిమ్ కుక్ కు వార్షిక జీతం 98.73 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.734,42,77,875 కోట్లు. సింపుల్‌గా చెప్పాలంటే ఏడాదికి రూ.734 కోట్ల సాలరీ ప్యాకేజీ తీసుకున్నారు టిమ్ కుక్. యాపిల్ ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌లో మొదలై 2021 సెప్టెంబర్‌లో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టిమ్ కుక్ ఎంత వేతనం తీసుకున్నారన్న విషయాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో యాపిల్ వెల్లడించింది. ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈఓల్లో టిమ్ కుక్ కూడా ఒకరు.
ఇది కూడా చదవండి : ఆ ఇద్దరి చేసిన పనికి ఆపిల్ సంస్థ చెల్లించిన పరిహారం రూ. 36 కోట్లు!..ఏడాదికి రూ.734 కోట్ల వేతనం అంటే రోజుకు సుమారు రూ.2 కోట్లు సంపాదిస్తున్నారు టిమ్ కుక్. అంటే గంటకు రూ.8 లక్షల పైన, నిమిషానికి రూ.13,000 పైన ఆయన సంపాదిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. యాపిల్‌కు ఇది అద్భుతమైన దశాబ్దం అని, 2011 ఆగస్టులో ఆయన సీఈఓగా పదోన్నతి చేపట్టిననాటి నుంచి తొలిసారి ఈక్విటీ అవార్డు లభించిందని యాపిల్ తెలిపింది. యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్ మరణించిన తర్వాత టిమ్ కుక్ 2011లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత యాపిల్ అనేక కేటగిరీల్లో విస్తరించింది. వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ సేవల ద్వారా రెవెన్యూ తీసుకురావడంలో టిమ్ కుక్ కీలకంగా వ్యవహరించారు. దీంతో రెవెన్యూ కోసం యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్ లాంటి గ్యాడ్జెట్స్‌పై ఆధారపడటం తగ్గింది.
ఇది కూడా చదవండి : భారత్ లో యాపిల్ ఫోన్ కొనాలంటే ఎన్ని గంటలు పనిచేయాలో తెలుసా