యాపిల్ స్టోర్లు ఇండియాలో ప్రారంభమైన సమయం నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. నిజానికి టిమ్ కుక్ ఈ స్టోర్లను ప్రారంభించడమే పెద్ద వార్తనుకుంటే.. అంతకు మించిన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాటిలో ఇన్నాళ్లు యాపిల్స్ స్టోర్స్ డిజైన్ గురించి, ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు యాపిల్ స్టోర్స్ లో చేసే ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.
ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంటోంది. పారితోషికం విషయంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ అనగానే ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఆదాయం ఎంత ఉంటుందో మీకు తెలుసా? చీర్ లీడర్స్ ఒక్కో మ్యాచ్ కు ఎంత మెుత్తం తీసుకుంటారు? అత్యధికంగా ఏ ఫ్రాంఛైజీ వారికి చెల్లిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ ఇంట్లో పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో పనివాళ్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతడి జీతం అన్ని లక్షలు ఉండటానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కంపెనీకి సీఈవోగా ఉండే వ్యక్తికి దాదాపుగా కోట్లలో జీతం ఇస్తారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఒక సీఈవోకి ఏడాదికి కోట్ల రూపాయలు జీతంగా ఇస్తారు. కానీ, ఒక సీఈవో మాత్రం నెలకు వేలల్లోనే జీతం తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మనిషి బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. ప్రస్తుత కాలంలో చేతిలో రూపాయి లేనిదే.. ఏ పని కాదు. మన జీవితంలో ఇంత ముఖ్య పాత్ర పోషించే డబ్బు సంపాదన కోసం.. రకరకాల పనులు చేస్తాం. కొందరికైతే నెలంతా కష్టపడి పని చేసినా సరే.. సరిపడా ఆదాయం లభించదు. ఉద్యోగంతో పాటు.. పార్ట్ టైంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు ఎందరో ఉన్నారు. ఇంతలా కష్టపడితే కానీ ఫలితం […]
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా చెలామణి అవుతున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛైర్మన్ దినేష్ ఖారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం కింద రూ.34.42 లక్షలను అందుకున్నట్టు ఎస్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఈయనకంటే ముందు ఛైర్మన్‌గా పనిచేసే రజ్‌నీష్ కుమార్ కంటే 13.4 శాతం అత్యధికంగా వేతనాన్ని దినేష్ ఖారా అందుకున్నట్టు ఈ రిపోర్టులో పేర్కొంది. ఖారా 2020 అక్టోబర్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఖారా ఛైర్మన్ కాకముందు.. గ్లోబల్ […]
ఈ తరం యువకులకు ‘టెన్ టూ సిక్స్’ ఉద్యోగాలు నచ్చటం లేదు. నిత్యం కొత్తదనం కోరుకుంటున్నారు. తక్కువ కష్టపడాలి ఎక్కువ సంపాదించాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఏదైనా జాబ్‌లో చేరినా నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే “బోర్ కొట్టేసింది.. కిక్ లేదు” అని రవితేజ ‘కిక్’ సినిమాలో చెప్పినట్లుగా.. ఒక డైలాగ్ తో సమాధానమిస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు అమెరికాకు చెందిన మెకైల్ లిన్. జాబ్ చేస్తుంటే శాటిస్‌ఫ్యాక్షన్ లేదంటూ జేబులు నింపే […]
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జీతాలను దాదాపు రెట్టింపు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. రాజీనామాల సంస్కృతికి చెక్ పెట్టడంతో పాటు, నిపుణులైన వారిని కాపాడుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు. అందుకే మన సంస్థకు మంచి ఆదరణ ఉంది. అందుకు మీకు పెద్ద […]
‘పనికి తగిన ప్రతిఫలం’.. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. పూర్వ కాలంలో చేసిన పనికి వస్తు, ధాన్య రూపంలో ప్రతిఫలం చెల్లించేవారు. ఇక రాజుల కాలంలో కొందరు పనికి ప్రతిఫలంగా భూములు ఇచ్చేవారు. ఇప్పుడు రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్య నడుస్తోంది. ప్రస్తుతం పనికి డబ్బుల రూపంలో వేతనం ఇస్తున్నారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. అయితే కరోనా తర్వాత నుంచి డబ్బు విలుప పడిపోతుండటంతో.. ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో […]