ఈ తరం యువకులకు ‘టెన్ టూ సిక్స్’ ఉద్యోగాలు నచ్చటం లేదు. నిత్యం కొత్తదనం కోరుకుంటున్నారు. తక్కువ కష్టపడాలి ఎక్కువ సంపాదించాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఏదైనా జాబ్‌లో చేరినా నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే “బోర్ కొట్టేసింది.. కిక్ లేదు” అని రవితేజ ‘కిక్’ సినిమాలో చెప్పినట్లుగా.. ఒక డైలాగ్ తో సమాధానమిస్తున్నారు. ఆ కోవలోకే వస్తాడు అమెరికాకు చెందిన మెకైల్ లిన్. జాబ్ చేస్తుంటే శాటిస్‌ఫ్యాక్షన్ లేదంటూ జేబులు నింపే ఉద్యోగానికి జెల్ల కొట్టాడు. అందులోనూ.. తాను ఎందుకు ఉద్యోగానికి రాజీనామా చేశానో సవివరంగా లింకెడ్‌ఇన్‌లో వివరించాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.
మైఖేల్ లిన్ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. అంతుకు ముందు అతడు అమెజాన్‌లో పెద్ద స్థాయిలో పని చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో చేరిన తర్వాత అక్కడ పని విధానం అర్థం చేసుకోవడం, సంస్థ ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడంలో లిన్‌కు.. మంచి మజా దొరికేది. చేరిన కొత్తలో పని చేస్తుంటే..కాలేజీ రోజుల్లోగా సరదాగా ఉండేదని తెలిపాడు. ఈ క్రమంలో తనకంటూ ఓ టీమ్, వాళ్లకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పడ్డాయి. అన్నింటా సక్సెస్ అయ్యారు. దీంతో లిన్ వార్షిక వేతనం ఏకంగా 4,50,000 డాలర్లకు (రూ.3.5 కోట్లు) చేరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కరోనా తరువాత తన ప్రపపంచమే మారిపోయిందని తెలిపాడు.
Man quits Rs 3.5 crore salary job at #Netflix because he was bored of it
♦️I made about Rs 3.5 crore a yr, got free food daily, and had unlimited paid time off, ” Michael Lin said. “The only thing left was the work itself, and I didn’t enjoy the work anymore” he said. pic.twitter.com/QcBr1zQupk
— Zaid Ahmd (@realzaidzayn) June 6, 2022
కరోనా ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో జాబ్, లైఫ్ రోటీన్‌గా మారాయి. రోజువారి కార్యక్రమాలతో ఉద్యోగం చేసే మూడ్, ఉత్సాహం రెండూ చచ్చిపోయాయి. 2021 ఏప్రిల్‌లో తన పనితీరును మదింపు చేసుకున్న తర్వాత.. తాను మారాల్సిఉందనే నిర్ణయానికి వచ్చాడట. కానీ పెద్ద జీతం కోసం.. కిక్కు కరువైన చోట పని చేయడం వేస్టని చివరకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యడట. ఇప్పుడు తనకంటూ కొత్తగా ఓ టీమ్‌ను రెడీ చేసుకున్నానని చెబుతున్నాడు. అతి త్వరలోనే ఉద్యోగిగా కాకుండా యజమానిగా కొత్త పాత్రలో సరికొత్త కిక్కును వెతుకుంటాను అని చెబుతున్నాడు.
— Govardhan Reddy (@gova3555) June 6, 2022
ఇది కూడా చదవండి: OYO Success Story: ఒకప్పుడు చిన్న కిరాణషాపు ఓనర్ కొడుకు.. నేడు 9 వేల కోట్లకు అధిపతి!
అంత పెద్ద జీతం ఉన్న ఉద్యోగం వదిలేసినందుకు తల్లిదండ్రులు కాస్త గట్టిగానే తిట్టారని చెబుతున్నాడు. తన మెంటార్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారని చెప్పాడు. మరో ఉద్యోగమేదైనా లైనప్‌లో పెట్టుకుని అప్పుడు ఈ జాబ్ వదిలేయాల్సింది అని సలహా ఇచ్చాడట. కానీ లిన్ మాత్రం ఈ మాటలేమీ పట్టించుకోలేదు. వృత్తి పరంగా సంస్థలో సంతృప్తిగా లేనప్పుడు ఎంత ప్యాకేజీ ఇస్తే మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. కారణమేదైనా అన్ని కోట్ల ప్యాకేజీని వదులుకోవటం అంటే మాటలా..? ఏదేమైనా ఇంతటి సాహోసపేత నిర్ణయం తీసుకున్న.. మెకైల్ లిన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.