జాబ్ అనేది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కంపెనీలు మూసివేయడం గానీ లేదా ఉద్యోగం కోల్పోవడం గానీ జరిగితే మళ్ళీ జాబ్ దొరికేవరకూ కష్టమే. అటువంటప్పుడు ఈ సరికొత్త జాబ్ ప్రొటెక్షన్ ప్లాన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెలకు రూ. 33, రూ. 83 ప్లాన్ తో మీరు జాబ్ లేకపోయినా జీతం తీసుకోవచ్చు.
ఈ మధ్య కంపెనీలు లేఆఫ్ పేరుతో అనేక మందిని ఉద్యోగం లోంచి తొలగిస్తున్నాయి. ఇటీవల కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ జాబ్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అటువంటప్పుడు నెల నెలా కొంత డబ్బు వస్తే బాగుణ్ణు అని అనుకుంటారు. కొంత కాదు.. నెల జీతమే వస్తుంది. 3 నెలల పాటు అంతకు ముందు మీరు కంపెనీలో తీసుకున్న జీతం వస్తుంది. అంతేకాదు.. ఆ తర్వాత 3 నెలలు కనీస అవసరాల కోసం కొంత అమౌంట్ కూడా వస్తుంది. అంతేకాదండి బాబు.. ఉద్యోగం వచ్చేలా సహాయం కూడా చేస్తారు. జాబ్ లేకున్నా కూడా ఆదాయం వస్తుంది. లేజీ పే అనే ఫైనాన్స్ సంస్థ ప్రొటెక్ట్ యువర్ ఇన్కమ్ పేరిట ఒక ఎస్యూర్ కిట్ ని ఆఫర్ చేస్తుంది.
ఇది యాక్టివేట్ చేసుకున్నాక మీరు ఉద్యోగం కోల్పోతే కనుక మీరు పనిచేసిన కంపెనీలో ఎంత జీతం అయితే తీసుకున్నారో అంత జీతం.. 3 నెలల పాటు మీ ఖాతాల్లో జమ చేస్తుంది. అంతేకాదు కనీస అవసరాల కోసం అత్యవసర ఫండ్ ని కూడా ఇస్తుంది. పార్టనర్స్ ద్వారా జాబ్ ప్లేస్ మెంట్ ఉండేలా సహాయం చేస్తుంది. ఎక్స్ క్లూజివ్ ప్లేస్ మెంట్ నెట్వర్క్ లో జాబ్స్ చేసుకునేలా యాక్సెస్ ఇస్తారు. ప్లే స్టోర్ లో లేజీపే అనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.
ఇందులో ప్లస్, బేసిక్ అనే రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీ జీతం పన్నులు, కటింగులతో కలిపి రూ. 25 వేలు అనుకుంటే కనుక నెలకు రూ. 83 ప్లాన్ ని ఎంచుకోవాలి. ఏడాదికి రూ. 996 అవుతుంది. ఒకేసారి చెల్లిస్తే కనుక జాబ్ కోల్పోయిన సమయంలో మొదటి 3 నెలల పాటు నెలకు రూ. 25 వేల చొప్పున రూ. 75 వేలు చెల్లిస్తారు. ఆ తర్వాత 3 నెలల పాటు అత్యవసర ఫండ్ కింద నెలకు రూ. 2,500 చొప్పున రూ. 7,500 చెల్లిస్తారు. అంతేకాకుండా వేరే కంపెనీలో జాబ్ వచ్చేలా సహాయం చేస్తారు. వీరికున్న నెట్వర్క్ పరిధిలో ఉన్న అనేక కంపెనీల కారణంగా భవిష్యతుకు రక్షణ అనేది ఉంటుంది. నెలకు రూ. 83 ప్లాన్ కాకుండా రూ. 33 ప్లాన్ ఉంది. ఏడాదికి రూ. 396 చెల్లిస్తే.. నెలకు రూ. 10 వేల చొప్పున మొదటి మూడు నెలల పాటు జీతం వస్తుంది.
అంటే మూడు నెలలకు రూ. 30 వేలు ఇస్తారు. ఆ తర్వాత మూడు నెలలు అత్యవసర ఫండ్ కింద నెలకు రూ. 1000 చొప్పున 3 నెలల పాటు ఇస్తారు. ఇక ఉద్యోగ, భవిష్యత్తు రక్షణ అవి కామన్ గా ఉంటాయి. జీతం బట్టి ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీ జీతం రూ. నెలకు 60 వేలు అనుకుంటే కనుక ప్లస్, బేసిక్ ప్లాన్స్ తో పాటు అదనంగా ప్రో ప్లాన్ యాడ్ అవుతుంది. ప్రో ప్లాన్ లో మొదటి 3 నెలలు నెలకు రూ. 50 వేలు ఇస్తారు. అలానే అత్యవసర ఫండ్ కింద ఆ తర్వాత 3 నెలలు నెలకు రూ. 5 వేలు ఇస్తారు. దీని ప్లాన్ వచ్చేసి నెలకు రూ. 158. ఏడాదికి రూ. 1,896. ప్లస్, బేసిక్ ప్లాన్స్ జీతం ఎంతైనా ఒకేలా ఉంటుంది. ఏ ప్లాన్ తీసుకున్నా గానీ ఏడాదికి చెల్లించాలి.