కప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు పురుగులు తీయాల్సిందే. టీవీల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. మంచి సినిమా టాక్ వస్తే చాలు.. ఇంత సమయం ఎవరూ వెయిట్ చేస్తారంటూ సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు ఒళ్లు కదలకుండా
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు పురుగులు తీయాల్సిందే. టీవీల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పట్టేది. సినిమా మంచి టాక్ వస్తే చాలు.. అంత సమయం ఎవరూ వెయిట్ చేస్తారంటూ సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు ఒళ్లు కదలకుండా ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను చూసే అవకాశం కల్పించాయి ఓటీటీ సంస్థలు. కొత్త సినిమాలు కూడా నెల తిరగకుండానే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో కొంత మంది ముఖ్యంగా మహిళలు థియేటర్లకు వెళ్లడం లేదు. అయితే థియేటర్లపై సినిమా ప్రేక్షకుల అభిమానం తగ్గలేదు కానీ.. ఓటీటీలు వచ్చేశాక వెబ్ సిరీస్‌లపై మక్కువ పెంచుకున్నారు యూత్. అటుంటి వెబ్ సిరీస్, సినిమాల, టీవీ కోసం రూపుదిద్దుకున్న సంస్థ నెట్ ఫ్లిక్స్.
టీవీ షోలు, వెబ్ సిరిస్, కొత్త సినిమాలను అందిస్తూ దూసుకెళుతున్న ఓటీటీ ప్రపంచ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారత్ లోని తమ యూజర్లను బిగ్ షాక్ నిచ్చింది. ఇప్పటి వరకు దీని చందాదారులుగా చేరిన వారు.. పాస్ వర్డ్ షేరింగ్ విధానంతో మరి కొంత మంది, మరికొన్ని డివైజ్‌లలో వినియోగించుకునే అవకాశం ఉంది. అది యూజర్లు తీసుకునే ప్లాన్ల బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పాస్ వర్డ్ షేరింగ్ విధానానికి స్వస్థి పలకనున్నట్లు ప్రకటించింది. ఎవరైతే చందా తీసుకుంటారు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఓటీటీ సేవలు వినియోగించుకోగలరని తెలిపింది. యూజర్ల అభిరుచి, సంతృప్తి మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీ షోలు, కొత్త సినిమాలు కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ విధానానికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయాల్లో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చునని తెలిపింది. ప్రొఫైల్‌ను బదిలీ చేయటం, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజస్ వంటి కొత్త ఫీచర్ల సాయంతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ సదుపాయాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ ఓటీటీ దిగ్గజం తన ఫ్లాట్‌ఫాం ద్వారా పంచుకుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మెయిల్స్ పంపుతామని తెలిపింది. కరోనా కారణంగా నెట్‌ఫ్లిక్స్ అభివృద్ధిలో తీవ్ర మందగమనంతో పోరాడటంతో పాటు పోటీ కూడా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా యూజర్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్టేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్‌తో పాటు 100కు పైగా దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌ను భవిష్యత్తులో అంగీకరించమని మే నెలలోనే ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.