హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వానల కారణంగా అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నదులు, వాగులు వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా కులు, మండీ మధ్య రోడ్డు తెగిపోవడంతో ప్రజల రాకపోకలు స్తంభించాయి. కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగి పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇండ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పాత భవనాలు చాలావరకు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తాజాగా మరికొన్ని భవనాలు కుప్పకూలుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు. కాబట్టి ఈ బిల్డింగ్స్ కూలిపోయినా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ బిల్డింగ్స్ కూలడాన్ని చూసి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనీ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంత వరకు కూలిపోయిన భవనాల్లో జనాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు కానీ పెద్దమొత్తంలో ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా ప్రమాదాలు నెలకొన్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అలెర్ట్ అయి అక్కడి ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలించారు. రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రుతుపవనాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడుసార్లు అతిభారీ వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 8వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district.
(Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ
— ANI (@ANI) August 24, 2023