ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పాలా కాపాడుతున్నారు. రాత్రి, పగలు కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం పెద్దలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను చాలా కేర్‌లెస్ చేస్తున్నారు. పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను పంచుకుని అనుభవిస్తూ.. వారిని ఇంటినుండి గెంటివేస్తున్నారు.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పాలా కాపాడుతున్నారు. రాత్రి, పగలు కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేస్తున్నారు. కానీ పిల్లలు మాత్రం పెద్దలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను చాలా కేర్‌లెస్ చేస్తున్నారు. పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను పంచుకుని అనుభవిస్తూ.. వారిని ఇంటినుండి గెంటివేస్తున్నారు. కనిపెంచిన పేరెంట్స్‌ను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు మలిదశలో వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. వారి ఆలనాపాలనా చూసేవారు కరువై దిక్కులేని పరిస్థితిని అనుభవిస్తున్నారు. జయపురం రోడ్డపైనే బిచ్చమెత్తుకుంటూ బతుకువెళ్లదీస్తున్న ఓ వృద్ధుడి గాథ తాజాగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..
లక్ష్మీకాంత్ అనే వ్యక్తి జయపురం సమితి వ్యవసాయ కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడు. అతను పట్టణంలోని సూర్యమహల్ సమీపంలో నివసించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన వ్యక్తిగత కారణాలతో ఆరు నెలల గడువు ముందుగానే ఉద్యోగ విరమణ చేశాడు. వచ్చిన డబ్బులతో జయపురం, బొరిగుమ్మ, మల్కాన్‌గిరి, నవరంగపూర్‌లో నాలుగు ఇళ్లు కొన్నాడు. వారి కొడుకులు, కూతుళ్లతో కలిసి ఉండేవాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొన్నేళ్ క్రితం ఇంటినుండి వెళ్లిపోయాడు. ఖుర్దాలో ఒక ఓల్డ్‌ఏజ్ హోంలో చేరాడు. చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు.
ఇటీవల ఆశ్రమాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆశ్రమాన్ని ఖాళీ చేయించారు. అక్కడి నుండి జయపురానికి చేరుకున్నాడు. తన ఇంటికి వెళ్లగా భార్య లక్ష్మీకాంత్ పట్ల కటువుగా మాట్లాడింది. తను చనిపోయాడని బొట్టు, గాజులు తీసేసింది. కుమారులు, కుమార్తెలు కూడా అతని పట్ల పరుషంగా మాట్లాడడంతో మరింత మనస్తాపానికి గురయ్యాడు. దీంతో స్థానికంగా రాజ్‌మహాల్ వద్ద ఉన్న విక్రమ్‌దేవ్ మహారాజా విగ్రమం వద్ద బిక్షం అడుక్కుంటూ గడుపుతున్నాడు. పిల్లలను నమ్మి ఆస్తులను వారి పేరున రాయొద్దంటూ తనతో మాట్లాడేవారికి చెబుతుంటాడు. నిర్లక్ష్యం చేసే తన వారి వద్ద ఉన్నా, లేకున్నా ఒకటే అని నిరుత్సాహపడుతుంటాడు. కొంతమంది అతని వివరాలను ఆరా తీయగా తన దీనమైన గాథను చెప్పుకొచ్చాడు. లక్ష్మీకాంత్ దగ్గరికి ఈవో సిద్ధార్థ్ వెళ్లి ఆశ్రమానికి తరలించారు. అతని బాగోగులను తాము చూసుకుంటామని తెలిపారు.