బండి మీద వెళుతున్నప్పుడు సాధారణంగా చున్నీలు లేదా చీర కొంగులు వాహనంలోని చక్రాల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. వెనుక వెళ్లేవారు చూస్తే మాత్రం కచ్చితంగా అలర్ట్ చేస్తారు. ‘మేడమ్.. మీ చున్నీ లేదా చీర బైక్ చక్రాల్లో ఇరుక్కుంటుందని’ అని అప్రమత్తం చేస్తారు.
బండి మీద వెళుతున్నప్పుడు సాధారణంగా చున్నీలు లేదా చీర కొంగులు వాహనంలోని చక్రాల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. వెనుక వెళ్లేవారు చూస్తే మాత్రం కచ్చితంగా అలర్ట్ చేస్తారు. ‘మేడమ్.. మీ చున్నీ లేదా చీర బైక్ చక్రాల్లో ఇరుక్కుంటుందని’ అని అప్రమత్తం చేస్తారు. కానీ కొన్ని సార్లు ఎవ్వరూ చూడకపోతే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది. దుప్పట్టా లేదా చీర కొన ఇరుక్కుని చివరకు బైక్ నుండి పడిపోయి.. రోడ్డు ప్రమాదాలకు గురైన ఘటనల గురించి చదివాం. అయితే ఒక్కోసారి అదే ప్రమాదం ప్రాణాల మీదకు కూడా తెచ్చిపెడుతుంది. ఆ దుస్తులు మెడకు చుట్టుకుని ఉరి కొయ్యలుగా మారుతున్నాయి.
భర్తతో బైక్ పై వెళుతున్న ఓ మహిళ చున్నీ కారణంగా ప్రమాదవశాత్తూ వాహనంపై నుండి జారిపడి మృతి చెందింది. చున్నీలోని ఓ కొన బైక్ చక్రాల్లో పడటంతో వాహనం నుండి ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె మెడకు చున్నీ బిగిసిపోవడంతో మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని కందివాలి ప్రాంతానికి చెందిన ప్రతిమ యాదవ్ తన భర్త మనీష్ యాదవ్‌తో కలిసి వాసాయ్‌లోని తుంగరేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించేందుకు బుల్లెట్ బండిపై వెళుతోంది. అయితే ఆమె ధరించిన దుపట్టా రోడ్డు ఈడ్చుకుంటూ వెళుతోంది. ఈ విషయాన్ని ఇద్దరూ గమనించలేదు.
అనుకోకుండా ఆ చున్నీ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. బండి వేగంగా వెళుతుండటంతో చున్నీ ఇరుక్కుని ఆమె మెడకు బలంగా చుట్టుకుంది.ఏం జరిగిందో తెలుసుకునే లోపు.. బండి మీద నుండి ప్రతిమ జారి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. రెప్ప పాటులో జరిగిన ఈ ప్రమాదంతో భార్యను పొగొట్టుకున్నాడు భర్త. తన కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు.