నిన్ననే ఆ చిన్నారి పుట్టినరోజు. నిండు నూరేళ్లు చల్లగా బతకమని తల్లిదండ్రులు ఆశీర్వదించారు. జీవితాంతం తోడుగా ఉంటానని అన్న చెల్లికి భరోసా ఇచ్చాడు. అయితే ఆ సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టింది ఏమో. తెల్లవారే సరికి.. వారి జీవితాలు తెల్లారిపోయాయి. చావులోనూ చిన్నారుల రక్త సంబంధం విడిపోలేదు. ఆ వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీ నగరం ఓ భవనం రోడ్డుపై కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సిటీలో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. గత 14 గంటల్లో 14 మందిని పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వజీర్ హసన్ గంజ్ రోడ్‌లోని ఈ పాత బిల్డింగ్ ఒక్కసారిగా కూలిందని ప్రత్యక్ష సాక్షులు […]
ప్రతీ బిల్డింగ్ కి చిన్న చిన్న బీటలు పడడం అనేది మామూలే. అయితే ఆ బీటలు మరీ ఎక్కువైతే బిల్డింగ్ అమాంతం కూలిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే జరిగింది. ఉన్నట్టుండి నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. సినిమాల్లో బాంబ్ వేస్తే కూలినట్టు, జేసీబీలతో పడగొట్టినట్టు.. బిల్డింగ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా కూలిపోయింది. లైవ్ లో అందరూ చూస్తుండగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కొంతమంది భవనం కూలడం దగ్గర నుంచి చూశారు. బీటలు పడి.. కూలిపోవడానికి […]
అనంతపురం జిల్లా కదిరిలో తీవ్ర విషాదం నెలకొంది. కదిరి పాత ఛైర్మన్ వీధిలో తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఆ భవనం శిథిలాలు మరో రెండు భవనాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇంట్లో 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు సహా మొత్తం 15 మంది చిక్కుకున్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతిచెందారు. శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా […]
ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ వింత జరిగినా.. ఏ సంఘటనలు జరిగినా క్షణాల్లో మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. అందులో కొన్ని భయాన్ని పుట్టించగా.. మరికొన్ని వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. గత కొంత కాలంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ […]