హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొండ చరియలు విరిగిపడటంతో అందరు చూస్తుండగానే భవనాలు ఒకదాని తర్వాత ఒకటి కుప్పకూలాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
ఉత్తర భారతదేశంలో భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో డ్యాం పొంగిపొర్లుతుంది. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
‘రోమ్ నగరం మంటల్లో తగులబడుతున్న సమయంలో నీరో చక్రవర్తి ప్రశాంతంగా ఫిడేలు వాయించాడట’అనే సామెత చాలా మందికి తెలుసు. అంటే ఆపద ముంచుకొస్తున్న సమయంలో ఏం పట్టన్నట్లు వ్యవహరించిన వారి పట్ల ఈ నానుడిని వినియోగిస్తుంటారు.
మన్యం ప్రాంతంలో ఓ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆస్పత్రికి తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి గిరిజనులు పాప ప్రాణాలను కాపాడేందుకు ఓ సాహసం చేశారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురికి నీరు నిలిచి వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రైనేజీ నీటితో తిప్పలు తప్పట్లేవు.
హైహైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రజలు భయటికి రావడానికి జంకుతున్నారు.
తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దంచి కొడుతున్న వానలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగలు ఉప్పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో డీజీపీ పలు సూచనలు చేశారు.