తమన్నా హద్దులు దాటేస్తుందా? ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి మరీ నటిస్తోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే జీ కర్దా వెబ్ సిరీస్ తో ఎప్పుడూ లేని విధంగా ఘాటు సన్నివేశాల్లో నటించిన తమన్నా.. మరో వెబ్ సిరీస్ లో కూడా అదే తరహాలో రెచ్చిపోయి నటించింది.
సినిమాల్లో నటించినన్ని రోజులూ హద్దుల్లో ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీల మీద రెచ్చిపోయి మరీ నటిస్తోంది. అవకాశాలు తగ్గిపోవడంతో అడల్ట్ బాట పట్టిందేమో అనేలా తమన్నా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఇప్పటికే జీ కర్దా వెబ్ సిరీస్ లో అశ్లీల సన్నివేశాలు, అశ్లీల డైలాగులతో సెగలు పుట్టించిన తమన్నా ఇప్పుడు మరో వెబ్ సిరీస్ తో రెడీ ముందుకొస్తుంది. అదే లస్ట్ స్టోరీస్ 2. ఈ సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లలో ‘లస్ట్ స్టోరీస్’ ఒక సంచలనం. అప్పట్లో దుమారం రేపిన అడల్ట్ వెబ్ సిరీస్ ఇది. శృంగార సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో బాగా ఆడిన సిరీస్. ఇందులో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, నేహా ధూపియా వంటి హీరోయిన్స్ నటించారు.
ఈ సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ ని తెరకెక్కించారు. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ, కాజోల్ దేవగన్ తదితరులు నటించారు. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు. ‘కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా.. మరి పెళ్ళికి ముందు ఎందుకు టెస్ట్ డ్రైవ్ చేయకూడదు’ అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక జీ కర్దాలో మాదిరిగానే ఇందులో కూడా తమన్నా ఓ రేంజ్ లో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. తమన్నా ఇంటిమేట్ సీన్స్ తో పాటు అగ్నిపర్వతం, విస్ఫోటనం, టెస్ట్ డ్రైవ్ అని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి.
ఈ సిరీస్ లో తనతో పాటు నటించిన విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో కొనసాగుతోంది. ఇటీవల వీరి రిలేషన్ షిప్ ని బయటపెట్టింది తమన్నా. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సిరీస్ లో విజయ్ వర్మ పాత్రకు ఆల్రెడీ పెళ్లి అయినా గానీ తమన్నా పాత్రతో సంబంధం పెట్టుకుంటాడు. మరి వీరి రిలేషన్ సిరీస్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందా? లేక మధ్యలోనే బ్రేక్ పడుతుందా? అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. మొత్తానికి తమన్నా ఓటీటీలో మాత్రం హద్దులు చెరిపేసి మరీ నటిస్తుంది. మునుముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.