ఒక కంపెనీకి సీఈవోగా ఉండే వ్యక్తికి దాదాపుగా కోట్లలో జీతం ఇస్తారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఒక సీఈవోకి ఏడాదికి కోట్ల రూపాయలు జీతంగా ఇస్తారు. కానీ, ఒక సీఈవో మాత్రం నెలకు వేలల్లోనే జీతం తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
సీఈవో.. ఈ పదాన్ని తరచుగా వింటూనే ఉంటాం. సినిమాల్లో చూపిన విధంగానే రియల్ లైఫ్ లో కూడా సీఈవోల జీతాలు కోట్లలో ఉంటాయి. ఇటీవలే యాపిల్ సీఈవో సగం జీతం కోత విధించుకుని రూ.405 కోట్లు మాత్రమే జీతం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన సగం కోత విధించుకుంటేనే జీతం రూ.405 కోట్లు అయింది. ఇంక సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారి జీతాలు కూడా కోట్లలోనే ఉంటాయి. కానీ, ఒక సీఈవో మాత్రం నెలకు వేలల్లోనే జీతం తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆయన నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.
నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే తీసుకుంటున్న ఆ సీఈవో మరెవరో కాదు.. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా అనమాట. ఆయన క్రెడ్ సీఈవోగా నెలకు ఎంత జీతం తీసుకుంటున్నారు అనే విషయాన్ని తాజాగా రివీల్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ అంటూ ఫ్యాన్స్ ని ప్రశ్నలు అడగాల్సిందిగా కోరారు. అందులో ఓ యూజర్ మీ జీతం సార్ అంటూ ప్రశ్నించాడు. అందుకు కునాల్ షా నెలకు రూ.15 వేలు జీతం తీసుకుంటాను అని బదులిచ్చారు. ఆ సమాధానం చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఒక సీఈవోగా అసలు నెలకు రూ.15 వేలు జీతం తీసుకోవడం ఏంటి? అని అవాక్కయ్యారు.
మరో వ్యక్తి మీరు అంత తక్కువ జీతంతో ఎలా బతుకుతారు సార్ అంటూ ప్రశ్నించాడు. అందుకు “కంపెనీ లాభాల బాట పట్టేవరకు నేను నెలకు రూ.15 వేలు మాత్రమే జీతం తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నేను నా ఫ్రీఛార్జ్ కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తాన్నాను” అంటూ కునాల్ షా సమాధానం చెప్పారు. ఇలా తక్కువ జీతం తీసుకుంటున్నాను అని చెప్పిన సీఈవోల్లో కునాల్ షా ఒక్కడే మొదటి వాడు కాదు. 2013లో జుకర్ బర్గ్ ఏడాదికి కేవలం ఒక డాలర్ మాత్రమే తీసుకున్నారు.
ఎలన్ మస్క్, ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సేలు సైతం ఏడాదికి ఒక డాలర్ మాత్రమే వేతనం తీసుకున్నారు. కునాల్ షా జీతం విషయంలో విమర్శలు కూడా లేకపోలేదు. కంపెనీ ఖర్చులతో రోజుకు లక్షలు ఖర్చుపెడుతూ లగ్జరీ లైఫ్ జీవిస్తారు. జీతం విషయం వచ్చే సరికి మాత్రం నెలకు కేవలం ఇంతే తీసుకుంటున్నాం అని చెబుతూ ఉంటారని విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దాదాపు రూ.15 వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని, 200కు పైగా స్టార్టప్స్ లో పెట్టబడులు ఉన్నాయంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. క్రెడ్ సీఈవోగా కునాల్ షా నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే వేతనం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
There are CEOs who take salaries in crores then we have Kunal Shah. 💖 pic.twitter.com/aahaDJmdAm
— Ajeet Patel | Leetcode ⚡ (@Iampatelajeet) February 26, 2023