ఐపీఎల్ అనగానే ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఆదాయం ఎంత ఉంటుందో మీకు తెలుసా? చీర్ లీడర్స్ ఒక్కో మ్యాచ్ కు ఎంత మెుత్తం తీసుకుంటారు? అత్యధికంగా ఏ ఫ్రాంఛైజీ వారికి చెల్లిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న మెగా క్రికెట్ టోర్నీ. ఇక ఐపీఎల్ అనగానే సిక్స్ లు, ఫోర్లు లతో పాటుగా చీర్ లీడర్స్ గుర్తుకు రాకమానరు. తమ అందంతో, డ్యాన్స్ తో ఇటు ప్రత్యక్షంగా, టీవీల్లో మ్యాచ్ చూస్తున్న అభిమానులను అలరిస్తుంటారు. ఇక ఐపీఎల్ అనగానే ఆటగాళ్లపై కోట్లకు కోట్లు కుమ్మరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఆదాయం ఎంత ఉంటుందో మీకు తెలుసా? చీర్ లీడర్స్ ఒక్కో మ్యాచ్ కు ఎంత మెుత్తం తీసుకుంటారు? అత్యధికంగా ఏ ఫ్రాంఛైజీ వారికి చెల్లిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడాలని కలలు కంటూ ఉంటారు. ఒక్కసారి ఈ లీగ్ లో ఆడితే లైఫ్ సెటిల్ అయినట్లే అని భావిస్తుంటారు ఆటగాళ్లు. ఇక ఈ టోర్నీలో ఆటగాళ్ల విషయం పక్కన పెడితే.. ఐపీఎల్ లో ప్రారంభం నుంచి ఉన్న చీర్ లీడర్స్ ఎంత జీతం తీసుకుంటారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమదైన హుషారైన స్టెప్పులతో ప్లేయర్స్ తో పాటుగా.. ఆటగాళ్లకు కూడా హుషారు తెప్పిస్తుంటారు. మరి వారు ఒక్కో మ్యాచ్ కు తీసుకునే పారితోషికం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. DNA రిపోర్ట్ ప్రకారం.. IPL చీర్ లీడర్స్ కు ఒక్కో మ్యాచ్ కు రూ. 12 వేల నుంచి 17 వేల వరకు ఫ్రాంఛైజీలు చెల్లిస్తాయట. ఇక మరో క్రీడా ఛానల్ క్రిక్ ఫాక్ట్స్ నివేదిక ప్రకారం ఐపీఎల్ లో చీర్ లీడర్స్ కు అత్యధిక జీతం చెల్లిస్తున్న ఫ్రాఛైజీ కోల్ కత్తా నెట్ రైడర్స్ అని సమాచారం. కేకేఆర్ ఒక్కో మ్యాచ్ కు చీర్ లీడర్స్ కు రూ. 24 వేల రూపాయలను అందిస్తోందట.
ఇక మిగతా ఫ్రాంఛైజీలు చెల్లించే జీతాలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నై, సన్ రైజర్స్, పంజాబ్, ఢిల్లీ తమ చీర్ లీడర్స్ కు ఒక్కో మ్యాచ్ కు కేవలం 12 వేలు మాత్రమే ఇస్తున్నాయని సమాచారం. ముంబై, బెంగళూరు ఫ్రాంఛైజీలు రూ. 20వేలు చెల్లిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక వీరికి ఈ జీతాలతో పాటుగా విలాసవంతమైన హోటళ్లలో బస, కాస్ట్ లీ ఫుడ్ తో పాటుగా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తాయి ఫ్రాంఛైజీలు. అయితే వీరి జీతం, జీవితం చూసి చీర్ లీడర్స్ జీవితం చాలా బాగుంది అనుకుంటున్నారా? కానీ చీర్ లీడర్స్ కు ఎంపిక కావాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. స్వతహాగా మంచి డ్యాన్సింగ్ స్కిల్స్ తో పాటుగా మోడలింగ్ రంగంలో అనుభవం కూడా ఉండాలి. అదీకాక అనేక ఇంటర్వ్యూల అనంతరం వీరిని సెలక్ట్ చేస్తాయి ఫ్రాంఛైజీలు. అదీకాక రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది.