ముఖేష్ అంబానీ ఇంట్లో పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో పనివాళ్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అతడి జీతం అన్ని లక్షలు ఉండటానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ.. ఇండియలోని అత్యంత ధనికుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే గౌతమ్ అదానీని ఓవర్ టేక్ చేసి నెంబర్ 1 స్థానానికి వచ్చాడు. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనికుల జాబితాలో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు అంబానీ. ఇక అంబానీ విలాసవంతమైన ఇల్లుల గురించి, కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అంబానీ కారు డ్రైవర్ కు అందించే జీతం గురించి సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అంబానీ కారు డ్రైవర్ జీతం అన్ని లక్షలు ఉండటానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ ఇంట్లో పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో పనివాళ్లు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అంబానీ డ్రైవర్ జీతం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? డ్రైవర్ కు జీతం అన్ని లక్షలా? అసలు అన్ని లక్షల జీతం ఇవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ ప్రయాణించే కారుకు డ్రైవర్ గా చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అదీకాక డ్రైవర్ నియామకం అంబానీ చేతిలో కూడా ఉండదని మీకు తెలుసా? అవును అంబానీకి డ్రైవర్ ను నియమించే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థ తీసుకుని అందుకు సంబంధించిన కార్యక్రమాలను అన్నింటిని పూర్తి చేస్తుంది.
ఇక అంబానీ కారుకు డ్రైవర్ కావాలంటే డ్రైవింగ్ తో పాటుగా కొన్ని సెక్యూరిటీ విద్యలు కూడా తెలిసి ఉండాలి. పైగా ప్రపంచంలో ఉన్న కార్లు అన్నింటిని నడిపే సామర్థ్యం ఉండాలి. ఎందుకంటే అంబానీ ఎప్పుడు ఏ లగ్జరీ, స్పోర్ట్స్ కారు కొంటారో తెలీదు కాబట్టి. డ్రైవింగ్ టెస్ట్ తో పాటుగా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కూడా నియమించుకునే డ్రైవర్ లో ఉండేలా చూస్తారు. మరీ ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్ ను ఎక్కువగా పరిగణంలోకి తీసుకుంటారు. డిసిప్లిన్, టైమింగ్, ఫర్ ఫెక్ట్ డ్రైవింగ్ లాంటి సవాలక్ష సవాళ్లను దాటుకు రావాలి అంబానీ డ్రైవర్ కావాలంటే. అందుకే అంత జీతం ఇస్తారు అతడికి. ఇక ముఖేష్ అంబానీ డ్రైవర్ కు ప్రస్తుతం అందుతున్న జీతం రూ. 2 లక్షలు అని సమాచారం. ఈ జీతం తెలిసిన నెటిజన్లు.. పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇంత జీతం ఉండదు కదా అని సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి ప్రపంచ కుబేరుడు అంత మాత్రం జీతం ఇవ్వడా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.