భారత్ లో యాపిల్ ఫోన్ కొనాలంటే ఎన్ని గంటలు పనిచేయాలో తెలుసా

బిజినెస్ డెస్క్- ఐఫోన్.. ప్రపంచంలో ఎన్ని కొత్త కంపెనీల మొబైల్ ఫోన్లు, ఎంత ఖరీదైన సెల్ ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యాపిల్ ఫోన్ ఉంటే అదో స్టేటస్ సింబల్ ఫీల్ అవుతున్నారు. అందుకే చాలా మంది తమ చేతిలో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. తమ బడ్జెట్ లో లేకపోయినా చాలా మంది యాపిల్ ఫోన్ ను కోనాలను తహతహలాడుతున్నాపు.

ఇక యాపిల్ ఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు కొందామా అని వెయికళ్లతో ఎదురు చూస్తుంటారు. అదే మన భారత్ లో ఐతే కొత్త మోడల్ ఐఫోన్ వస్తుందంటే ముందుగానే బుకుంగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇదీ యాపిల్ కంపెనీ ఐఫోన్ కు ఉన్న క్రేజ్. ఇందుకు తగ్గట్టుగానే యాపిల్ ఫన్ కొనాలంటే అంత ఆశామాషి వ్యవహారం ఏంకాదు. మిగతా ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్ దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఖరీదు.

iphone

ఇక తాజాగా యాపిల్  ఐఫోన్ 13ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ సారి మొత్తం నాలుగు మోడల్స్.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 మ్యాక్స్‌ ను యాపిల్ విడుదల చేసింది. ఈ ఫోన్ల ధరలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. యూకేలో వీటి ధర 679-549 పౌండ్ల మధ్య ఉండగా, అమెరికా, కెనడాలలో సగటున ఈ ఫోన్ల ధరలు వరుసగా 771-,691, 826-,941 డాలర్ల మధ్య ఉంది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఐఫోన్ ధరలు అందరికి కొంత మేర అందుబాటులోనే ఉన్నాయి.

ఐతే ఈ సారి ఐఫోన్ 13ని సొంతం చేసుకోవాలంటే ఏ దేశ ప్రజలు ఎన్ని గంటల పనిచేయాల్సి ఉంటుందన్న దానిపై బ్రిటన్‌కు చెందిన.. మనీ సూపర్ మార్కెట్.. ఓ సర్వే నిర్వహించింది. ఐఫోన్ 13ను సొంతం చేసుకోవాలంటే భారతీయులు ఏకంగా 724.2 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఈ సర్వేలో తేలింది. ఐపోన్ 13 ధర భారత్‌లో 79,900 రూపాయలు. అంటే సగటున 724 గంటలు పనిచేస్తే తప్ప ఇండియన్స్ ఐఫోన్ ను కొనుక్కోలేరన్నమాట.

ఇక ఫిలిప్పీన్స్ ప్రజలు ఐఫోన్ 13ను కొనాలంటే మన దేశం కంటే ఎక్కువ.. ఏకంగా 775.3 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే సుమారు మూడు నెలల పాటు పనిచేస్తే తప్ప ఐఫోన్ కొనలేరన్న మాట. అదే స్విట్జర్లాండ్‌లో ఈ ఫోన్‌ ను అత్యంత చాలా ఈజీగా కొన్నుకోవచ్చని సర్వేలో చేలంది. ఇక్కడివారు కేవలం 34 గంటలు పనిచేస్తే ఐఫోన్ ను కొనుక్కోవచ్చు. స్విట్జర్లాండ్ ప్రజల సగటు వార్షికాదాయం 79,270 డాలర్లు. ఇక ఇతర దేశాలు చూసినట్లైత్ బ్రెజిల్‌లో 690.5 గంటలు, హాంకాంగ్‌లో 61.9 గంటలు పనిచేస్తే ఐఫోన్ ను కొనుక్కోవచ్చని అధ్యయనంలో తెలింది.