పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ డ్యాన్స్, ఇమ్మాన్యూయేల్ చేసిన స్టంట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది.
ఇక షోలో ‘మాచర్ల సెంటర్‌లో రా.. రా.. రెడ్డి’ అంటూ సాగే పాటకు నటి ప్రగతి మాస్ డ్యాన్స్ వేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇక ఎప్పటిలానే హైపద్ ఆది.. ‘నాయనమ్మా.. మనవళ్లకు టీకాలు వేయించే వయసులో ఈ టాటూలు ఏంటి.. చూసుకోవాలి కదా.. పిల్లలను పెంచమంటే కండలు పెంచుతోంది..’ అంటూ ప్రగతి టాటూపై కౌంటర్ వేశాడు.
ఈ ఈమెంట్‌లో ఇమ్మానుయేల్‌తో ఓ స్పెషల్ పర్ఫామెన్స్ ప్లాన్ చేశారు షో నిర్వాహకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరహాలో ఇమ్మూ.. కార్ టైర్లు కింద చేతులు పెట్టాడు. ఆ తరువాత వర్ష కూడా తన చేతులను కారు టైర్ల కింద పెట్టింది. ఇక చివర్లో హైపర్ ఆది ట్యూబ్‌లైట్లను చూపిస్తూ.. ఇవి మనం పగలగొట్టుకోవాలని చెబుతాడు. మనం ఇది చేయలేమంటూ వర్ష చెబుతుంది. దాంతో ఆది ఇది చాలా సింపుల్ అంటూ ఇమ్మాన్యూయేల్‌ని కొడతాడు. దాంతో వర్ష నా ఇమ్మూనే కొడతావా అంటూ వర్ష, ఆదిని కొడుతుంది. ఆఖర్లో ఆది.. వర్షను కొట్టడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. ప్రసుత్తం ఈ ప్రోమో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.