గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ.. వస్తున్న షో బిగ్ బాస్. తాజాగా 7వ సీజన్ ప్రారంభం కానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో బుల్లితెర ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఫ్యాన్స్‌కి ఓ తీపి కబురు అందింది. దీంతో బాగ్ బాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల అల్లర్లు, గొడవలు, భావోద్వేగ సన్నివేశాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని ఒక చోట మిక్స్ చేసి చూపిస్తూ క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే అంతా సిద్ధం చేశారు నిర్వాహకులు. అయితే లాస్ట్ సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈ సీజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులను హౌజ్ లోకి తీసుకురావడంతో పాటు సరికొత్త టాక్స్ లతో అలరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం. గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు బాగ్ బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా అసక్తి చూపించలేదు. దీంతో ఈసారి ఉల్టా పల్టా కాన్సెప్ట్ అని చెప్పారు నాగార్జున. అందుకు సంబంధించిన టీజర్, వీడియోని ఈ మధ్య రిలీజ్ చేశారు. అయితే అది ఇంట్రస్టింగ్‌గా ఉంటూ.. ఓ మాదిరి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెప్టంబర్ 3నుంచి కొత్త సీజన్ షూరూ కానుందని ప్రకటించారు. ఇది బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇకపోతే ఇందులో నటించే కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను, కొత్త జంటలను హౌజ్ లోకి తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఈ లిస్టులో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని, మహేష్ బాబు కాళిదాసు, సిద్దార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. యాంకర్స్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ ఈ జాబితాలో ఉన్నట్లు టాక్. మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి వంటి సింగర్స్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. అలానే విడిపోయిన సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్ నోరోన్హా కూడా హౌజ్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.