జబర్దస్త్ షోపై నటుడు జోష్ రవి సంచలన కామెంట్స్ చేశారు.
జోష్ రవి…తను వెండి తెరకి పరిచయమైన మొదటి సినిమా రామ్ చరణ్ హీరోగా నటించిన మగ ధీర సినిమానే అయినా నాగ చైతన్య హీరోగా పరిచయమమైన జోష్ మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో జోష్ రవి గా పేరుతెచ్చుకున్నాడు రవి. తాజాగా రవి బుల్లితెర కి సంబంధించి ఒక ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ఫేమస్ షో గురించి మాట్లాడుతు కొన్ని లక్షలు ఇచ్చినా ఆ షో మాత్రం చెయ్యనని అనడం తాజాగా సంచలనం సృష్ఠ్టించింది.
జోష్ రవి ఇప్పటివరకు వంద సినిమాలకి పైగానే చేసాడు. కానీ కొన్ని సినిమాలే తనకి నటుడు గా గుర్తింపుని ఇచ్చాయి. నితిన్ హీరోగా వచ్చిన గుండెజారి గల్లంతయ్యింది సినిమాలో నితిన్ ని ముప్పతిప్పలకి గురిచేసే గే క్యారెక్టర్ లో రవి నటించిన విధానం థియేటర్స్ లో ప్రేక్షకులందర్నీ కడుపుబ్బ నవ్వించింది. అలాగే బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ లు డాన్స్ చేస్తుంటే రవి రామ్ చరణ్ కి గొడుగు పట్టుకొని పాటలో కామెడీ ని బాగా పండించాడు. సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో ఆటు పోటుల్ని ఎదుర్కున్న రవి దగ్గర జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ప్రస్తావనకి వచ్చింది.
జబర్దస్త్ కార్యక్రమం గురించి రవి మాట్లాడుతు తాను దాదాపు ఇరవై సినిమాలు పైగా చేసిన తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాంలో అవకాశం వచ్చింది. అందుకు సంబందించి ఒక టీమ్ లో పెర్ఫార్మ్ చేస్తే ప్రోగ్రాంకి కేవలం 2 వేలు మాత్రమే ఇచ్చేవారని రవి బాంబు పేల్చాడు. ఇంక ప్రోగ్రాంకి రెండు లక్షలు ఇస్తానని చెప్పిన కూడా వెళ్లనని అన్నాడు. కాకపోతే జబర్దస్త్ ప్రోగ్రామ్ కి ఎన్నోసార్లు గెస్ట్ గా వెళ్లానని కావాలంటే గెస్ట్ గా జబర్దస్ ప్రోగ్రాంకి వెళ్తాను గాని టీం లో పెర్ఫార్మ్ చెయ్యనని అన్నాడు.కేవలం తన ముందు ఉన్న లక్ష్యం సినిమాలే అని వాటిల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని జోష్ రవి చెప్పాడు.