దర్శకుడు విజయ భాస్కర్ నువ్వే కావాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన అల్లుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటివరకు ఇండస్ట్రీ ప్రేమకథలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. 2000లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయిత. కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలో తరుణ్, రిచా హీరో హీరోయిన్ గా నటించారు. అప్పటి వరకు బాల నటుడిగా నటించి మెప్పించిన తరుణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. దీని కంటే ముందు వేణు తొట్టెంపూడి హీరోగా స్వయంవరం అనే సినిమాని తెరకెక్కించారు. అది కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత నువ్వే కావాలి ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత లవ్ స్టోరీలకు ఎక్కువ అలవాటు పడ్డారు సినీ లవర్స్. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసాడు. తాజాగా ఆయన అల్లుడు రవి శివతేజ కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీసింహ ఉస్తాద్ సినిమాలో రవి శివతేజ నటించాడు. అందులో హీరోకి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉస్తాద్ గురించి స్పందించాడు. ఉస్తాద్ సినిమా బాగున్నా జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలతో విడుదల కావడం వల్ల తమకు అంత స్పేస్ దొరకలేదని చెప్పారు.
అంతే కాకుండా బిగ్ బాస్ గురించి కూడా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో 400కు పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రవి.. విజయ భాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడినని గుర్తు చేసుకున్నాడు. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే బిగ్ బాస్ కి వెళ్తే విడాకులు ఇస్తా అని చెప్పింది అంటూ.. నవ్వుతూ చెప్పాడు. బిగ్ బాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం బుల్లి తెర అభిమానులు ఈగర్ గా ఎదురుచుస్తున్నారు.