హీరోయిన్లు, నటీమణులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే చాలా మంది ముందుకొచ్చి క్యాస్టింగ్ కౌచ్ మీద తమ గళమెత్తారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా హీరోయిన్లకే కాదు.. బుల్లితెర యాంకర్స్ ని కూడా వదల్లేదు. యాంకర్ వర్షిణి కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్టు వెల్లడించింది.
ఆటంబాంబే ఆటంబాంబ్ లాంటి న్యూస్ ని పేల్చింది. బుల్లితెరపై రాణిస్తున్న అతికొద్ది మంది లేడీ స్టార్స్ లో వర్షిణి ఒకరు. ముగ్ద మనోహరమైన తన అందంతో, తేనెలూరే తన ఆకర్షణీయమైన మాటలతో అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వర్షిణి.. పేరుకు తగ్గట్టుగానే వర్షం వచ్చే ముందు వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే ఆహ్లాదకరంగా ఉంటూ తన గురించి ఎవరేం అనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడంలో దిట్ట. ఆనతి కాలంలోనే తన కంటూ అభిమానుల్ని కూడా సంపాదించుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటూ ఉంటుంది.
తాజాగా వర్షిణి సినీ ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్ మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. కరోనా సమయంలో లాక్ డౌన్ ముందు వర్షిణికి ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ కోసం వెబ్ సిరీస్ దర్శకుడు ఒక హోటల్ కి రమ్మని చెప్పడంతో వర్షిణి అక్కడకు వెళ్ళింది. అయితే ఆడిషన్ వంకతో తనను బట్టలు మొత్తం విప్పేసి బెడ్ మీద పడుకోమని అన్నాడని ఆమె కామెంట్స్ చేసింది. ఆ దర్శకుడి మాటలకు ఖంగుతిన్న వర్షిణి.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పుకొచ్చింది. తనకి ఎదురైన ఈ అనుభవం గురించి వర్షిణి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. అయితే వర్షిణి క్యాస్టింగ్ కౌచ్ గురించి గతంలో చెప్పిందే మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతోంది.