‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే మాట సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలకంటే బ్యాగ్రౌండ్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగానైనా గుర్తింపు తెచ్చుకుంటారు.. అదే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది.
‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే మాట సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలకంటే బ్యాగ్రౌండ్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగానైనా గుర్తింపు తెచ్చుకుంటారు.. అదే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది. కథానాయికుల కంటే అతి తక్కువ పారితోషికం, కెరీర్ ఎక్కువ కాలంపాటు కంటిన్యూ అవదు. పెళ్లి అయితే యాక్ట్రెస్ అనే ప్రొఫెషన్‌కి ఎండ్ కార్డ్ పడిపోయినట్లే అనే విషయాలు అందరికీ తెలిసినవే. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న వారినే అవకాశాలు వరిస్తుంటాయి. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతర భాషల స్టార్స్ అయిన ఉదంతాలు అనేకం. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందాన ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ కావడంతో ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.. ‘శంకర్ దాదా జిందాబాద్’ తో ఎంట్రీ ఇచ్చిన కరిష్మా కొఠారి, ‘వరుడు’ తో పరిచయమైన భాను శ్రీ మెహ్రా వంటి కొందరిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు..
కట్ చేస్తే సాక్షి వైద్య పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా ఘోర పరాజయం పాలైంది. సినిమానే పోయింది ఇక హీరోయిన్‌ని ఎవరు పట్టించుకుంటారు లే అనుకున్నారు. ఇక ఆమెకు అవకాశాలు అందని ద్రాక్షే అని ఫిక్స్ అయ్యారు. అఖిల్ ఫస్ట్ ఫిలిం ‘అఖిల్’ భామ సయేషా సైగల్ పరిస్థితి ఏమైంది? అని ఎగ్జాంపుల్స్ చెప్పుకొచ్చారు. అయితే ఒకటీ రెండూ కాదు.. ముచ్చటగా మూడు క్రేజీ ఆఫర్స్ సాక్షిని వరించాయి. ఆ మూడు కూడా మెగా హీరోల సినిమాలు కావడం విశేషం. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్‌ల పక్కన తను ఆడిపాడబోతుందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ – టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న ‘గాండీవధారి అర్జున’ లో కథానాయికగా నటిస్తోంది. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ‘విరూపాక్ష’ తో హిట్ కొట్టాడు. అదే బ్యానర్‌లో జయంత్ అనే కొత్త దర్శకుడితో చెయ్యబోయే సినిమాలో కథానాయికగా సాక్షి వైద్యను అనుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ హీరోయిన్ రోల్ కోసం సాక్షి అయితే బాగుంటుందనుకుంటున్నారని టాక్. యాక్ట్రెస్‌గా ఫస్ట్ ఫిలిం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా వరుసగా ఆఫర్లు రావడం, అదికూడా మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలతో జతకట్టబోతుండడంతో లక్ అంటే సాక్షి వైద్యదే అనేస్తున్నారు. ఈ న్యూస్‌తో పాటు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని గుర్తు పెట్టుకుని పారితోషికం కూడా డిమాండ్ చేస్తుందనే వార్త కూడా వినిపిస్తోంది.