అదిరిపోయే డ్యాన్సులతో మైమరపించే కంటెస్టెంట్స్ ఈసారి పర్ఫార్మ్ చెయ్యడానికి సూపర్బ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వారి స్టెప్పులు, జడ్జిల రియాక్షన్స్, హైపర్ ఆది పంచులతో ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.
ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సినిమా, ఓటీటీలతో పోటీ పడుతూ దూసుకెళ్తున్నాయి పలు టీవీ ఛానెల్స్. డిఫరెంట్ ప్రోగ్రామ్స్, సీరియల్స్, రియాలిటీ షోలతో అలరిస్తున్నాయి. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘ఢీ’ షోస్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ప్రతి వారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోస్ రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక అదిరిపోయే డ్యాన్సులతో మైమరపించే కంటెస్టెంట్స్ ఈసారి పర్ఫార్మ్ చెయ్యడానికి సూపర్బ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వారి స్టెప్పులు, జడ్జిల రియాక్షన్స్, హైపర్ ఆది పంచులతో ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇంతకుముందులానే మరింత వినోదాన్నివ్వబోతుందని హింట్ ఇచ్చేలా ఉందీ ప్రోమో.
చంద్రముఖి గెటప్‌లో చంద్రకళ పాట చేయాలనే ఆలోచన బాగుంది. పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మూవీలోని ‘కిళ్లీ కిళ్లీ’ పాటతో ఆది, దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చారు. లుంగీ కట్టుకుని తన స్టైల్లో స్టెప్పులేశాడు ఆది. ‘వన్స్ మనం ఫిక్సయ్యాక పిల్లైనా (పిల్లి), కిళ్లీ అయినా నమిలెయ్యడమే’ అనగానే.. దీపిక ‘ఛీ’ అంటూ రియాక్ట్ అయింది. మెగాస్టార్ ‘రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు’ సాంగ్‌తో ఎంటర్ అయిన చమ్మక్ చంద్ర ఎప్పటిలానే ‘రాములా’ అంటూ నవ్వించాడు.
అరటి పండు తొక్క గిఫ్ట్ ఇచ్చే టాపిక్ వచ్చినప్పుడు ఆది, దీపికను తొక్క అంటే, ఆమె ‘ఏయ్’ అంటూ అరిచింది. అలాగే ‘టెంట్, స్టంట్’ పంచ్‌కి నవ్వుతూనే ‘ఛీ ఛీ’ అంటూ రియాక్ట్ అయింది. జడ్జెస్ మార్క్స్ ఇవ్వడానికి రెడీ అవుతూ.. కంటెస్టెంట్లను సస్పెన్స్‌లో పెట్టడంతో ఎండ్ అయిన ప్రోమె నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.