సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు ప్రేక్షకాభిమానుల తాకిడి తట్టుకోవడం కష్టం. పోనీ సినిమా ఈవెంట్లో ఆడియన్స్‌లో ఎవరితోనైనా మాట్లాడాలంటే.. వాళ్లు ఏమడుగుతారోనని టెన్షన్. రీసెంట్గా ‘బేబి’ బ్యూటీ వైష్ణవి చైతన్యకి ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది.
సెలబ్రిటీలు బయట కనిపించినప్పుడు ప్రేక్షకాభిమానుల తాకిడి తట్టుకోవడం కష్టం. పోనీ సినిమా ఈవెంట్లో ఆడియన్స్‌లో ఎవరితోనైనా మాట్లాడాలంటే.. వాళ్లు ఏమడుగుతారోనని టెన్షన్. రీసెంట్గా ‘బేబి’ బ్యూటీ వైష్ణవి చైతన్యకి ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది. ఆనంద్ దేవరకొండ అభిమాని వైష్ణవికి ఊహించని షాక్ ఇచ్చాడు. రీసెంట్ సెన్సేషన్ ‘బేబి’ మూవీ మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారంటే సినిమా రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, మాస్ మహారాజా రవితేజ సహా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్పందన తెలియజేశారు.
ఓవైపు ‘బేబి’ టీమ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుండగానే మరోవైపు డైరెక్టర్ సాయి రాజేష్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ల మధ్య నెట్టింట కోల్డ్ వార్ నడుస్తోంది. మొదట ‘బేబి’ కథ ఓ హీరోకి చెప్పాలనుకుంటే అతను కనీసం కలవడానికి కూడా ఇష్ట పడలేదంటూ రాజేష్ చెప్పడం, ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న విశ్వక్ దానికి రియాక్ట్ అవడం, రీసెంట్గా మళ్లీ సాయి రాజేష్ మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటే ‘బేబి’ చూసిన చిరంజీవి చిత్రబృందాన్ని అభినందించడంతో పాటు స్వయంగా మెగా సెలబ్రేషన్స్ పేరిట ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అప్పుడు టీం ఫ్యాన్స్, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు.
ఆనంద్ దేవరకొండ ఫ్యాన్ అయిన ఓ కుర్రాడు విరాజ్ అశ్విన్ చేసిన క్యారెక్టర్ తనకు బాగా కనెక్ట్ అయ్యిందని, రియల్ లైఫ్‌లో తనది కూడా అలాంటి క్యారెక్టరేనని, అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నాడు. ఇక వైష్ణవి చైతన్యపై ఊహించని కామెంట్స్ చేశాడు. మేడమ్ మిమ్మల్ని చూస్తే మా లవరే గుర్తొచ్చింది. (సెకండ్ లవర్.. టెన్త్‌లో ఒకటి, ఇంటర్లో మరోటి రెండు లవ్ స్టోరీస్ ఉన్నాయని చెప్పడం హైలెట్ అసలు). మీరు మోసం చేసినట్లే నా పోరి నన్ను మోసం చేసింది’ అనగానే.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక షాక్ అయింది వైష్ణవి. అది సినిమాలో క్యారెక్టర్ మాత్రమే అంటూ యాంకర్ అక్కడితో కట్ చేసింది.
ఇది కూడా చదవండి : బేబి హీరోయిన్‌పై ఇంత అనురాగం చూపిస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా?