తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.
తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, తెలంగాణ శకుంతల, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.. ప్రస్తుతం ఆమె ఏ సినిమాలో మెరవడం లేదు. అయితే బుల్లితెరపై ఇటీవల కాలంలో లేడి కమెడియన్లు పుట్టుకొస్తున్నారు. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా అనేక మంది లేడీ హాస్య నటీమణులు వెలుగులోకి వచ్చారు. వారిలో రోహిణి, ఫైమా, పవిత్ర, వర్ష వంటి వారు అలరిస్తున్నారు. వీరిలో ఫైమా తీరే వేరు. పటాస్ అనే ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలో పటాకాగా మారిపోయింది.
పటాస్ ద్వారా మెప్పించిన ఫైమా.. ఆ తర్వాత జబర్థస్త్‌లోకి వచ్చింది. అప్పటి వరకు బుల్లెట్ భాస్కర్ స్కిట్లంటే ఓ మూస ధోరణిని ఫాలో అవుతాడు అన్న పేరు ఉండేది. కానీ ఫైమా వచ్చాక.. ఆయన స్కిట్లు మామూలుగా సక్సెస్ కాలేదు. ఓ రకంగా చెప్పాలంటే అతడి టీమ్ డెవలప్ అయ్యిందంటే అది ఫైమా కారణంగానే. ఆ తర్వాత బిగ్ బాస్ కోసం ఆ షో నుండి బయటకు వచ్చేసింది ఫైమా. బిగ్ బాస్-6లో 21 మందిలో ఓ కంటెస్టుగా వెళ్లిన ఫైమా.. 13వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. కానీ అన్ని వారాల పాటు మిగిలిన కంటెస్టులందరికీ గట్టిపోటీ నిచ్చింది. ఒకానొక దశలో శివంగిలా పోటీ పడేది. మగ కంటెస్టులకు ధీటుగా ఆడి.. ఔరా అనిపించింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఫైమా.. బిగ్ బాస్ జోడీలో సూర్యతో కలిసి డ్యాన్సులు చేసింది. ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అనిపించేలా ఫైమా డ్యాన్స్ ఉండేది. చివరకు సూర్య-ఫైమా జట్టు విన్నర్‌గా నిలిచింది.
స్టార్ మా పరివారం షోలో కనిపిస్తోన్న ఫైమా.. స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫైమా ఇప్పుడు అభిమానులకు చేదు వార్త వినిపించింది. ఫైమా, జబర్దస్త్ నటుడు, కమెడియన్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్న సంగతి విదితమే. పటాస్ షో నుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. వీరిద్దరూ కలిసి వీడియోలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. అయితే ఇటీవల ఇన్ స్టాలో ఓ లింక్ పోస్టు చేసింది. బేబి సినిమా చూసిన తర్వాత ప్రవీణ్, ఫైమా లవ్ బ్రేకప్ అని రాసింది. మరో వ్యక్తితో ఫైమా పెళ్లి అన్నట్లుగా కూడా థంబ్ చేశారు. తీరా అది బేబి సినిమాకు ప్రవీణ్, ఫైమా కలిసి స్పూఫ్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను ఇన్ స్టా లింక్ పెట్టింది. ఆ ప్రోమోను యూట్యూబ్ లో చూడొచ్చు. చాలా ఫన్నీగా సాగిపోయింది.