చిన్నప్పుడు అమాయకంగా కనిపిస్తూ బాల నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న పాప, టీనేజ్‌లోకి వచ్చాక గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే..
చిన్నప్పుడు అమాయకంగా కనిపిస్తూ బాల నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న పాప, టీనేజ్‌లోకి వచ్చాక గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే.. మలయాళీ భామ గౌరీ జీ కిషన్. తమిళ్ క్లాసిక్ ‘96’ మూవీలో.. అలాగే దాన తెలుగు రీమేక్ ‘జాను’ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘మాస్టర్’, ‘కర్ణన్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించారు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోవడంతో గౌరీకి సరైన బ్రేక్ రాలేదు.
కానీ అమ్మడి గ్లామర్, లుక్స్‌కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. గౌరీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఓ టాటూ ఫోటోతో జనాలకు షాక్ ఇచ్చింది. ఎవరికీ కనిపించని ప్లేస్‌లో టాటూ వేసుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పిక్ స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. దీన్నీ ‘రిబ్ టాటూ అంటారని కామెంట్ చేయడంతో కుర్రకారంతా ఎగబడి, జూమ్ చేసిన మరీ చూసేశారు. గౌరీ షేర్ చేసే పిక్స్, వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రీసెంట్గా మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్లింది. బీచ్‌లో వయ్యారాల విందు చేసింది. అక్కడ బికినిలో ఎంజాయ్ చేస్తూ ఆ హంగామా అంతటినీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్విమ్ సూట్లో కనిపించి యూత్ పోరగాళ్లకు కిక్ ఇచ్చింది. గౌరీని సడెన్‌గా అలా చూసే సరికి నెటిజన్లు షాక్‌తో పాటు సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆమె వెకేషన్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి, హీరోయిన్గా మారిన వాళ్ల లిస్ట్‌లో హైలెట్ అయిపోయింది గౌరీ జీ కిషన్.