బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో హీరోగా పలు సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు తన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉంటాయి.
సినిమా ఫీల్డ్‌కి చెందిన సెలబ్రిటీల గురించి సామాజిక మాధ్యమాల్లో పుట్టుకొచ్చే రూమర్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఇక వాటికి సంబంధించి వచ్చే ట్రోల్స్, మీమ్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. పువ్వు పూసింది అంటే కాయ కాసింది.. మేం కోసుకుతిన్నాం, టేస్ట్ అదిరిపోయింది అనే రేంజ్‌లో గాసిప్స్ వండేస్తుంటారు గాసిప్ రాయుళ్లు. టాలీవుడ్‌లో పెళ్లికాని 30+ యాక్టర్ల లిస్టులో తరుణ్ కూడా ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు నెట్టింట అతడి పెళ్లి వార్త వైరల్ అయింది. ఇటీవల తెలుగు పరిశ్రమలోని ఓ బడా ఫ్యామిలీకి అల్లుడిగా వెళ్లబోతున్నాడని, ఇది ఆమెకు రెండో పెళ్లి అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇది తెలిసి తరుణ్ రియాక్ట్ అయ్యాడు. నిజంగా ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.
తెలుగులో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో హీరోగా పలు సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు తన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెర మీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో.. పెళ్లి న్యూస్ మీద క్లారిటీ ఇచ్చాడు. తరుణ్ మాట్లాడుతూ.. ‘నా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదు.. నిజంగా ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతాను, నా పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు’ అన్నారు. దీంతో ప్రస్తుతానికి తరుణ్ పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.