బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్‌లు ఇందులో ఎంతలా ఎంటర్‌టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్‌లు ఇందులో ఎంతలా ఎంటర్‌టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటిలానే ఈ వీక్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కి ఈ వారం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ మూవీ టీం.. తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. కంటెస్టెంట్స్ చేసే కామెడీని జడ్జిలతో పాటు వారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సరాదాగా సాగిపోతూనే భావోద్వేగంతో గుండె బరువెక్కేలా ఉంది ప్రోమో. పార్టిసిపెంట్స్, జడ్జిలతో పాటు చూసిన ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
హైపర్ ఆది పెళ్లి చూపులు అనే థీమ్ తీసుకున్నాడు. ఈ శుభకార్యానికి ఆర్టిస్టులంతా తన ఫ్యామిలీలా వచ్చారని చెప్పడంతో ప్రారంభమైన ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ తో ఉర్రూతలూగించిన ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆది, బామ్మకు ప్రపోజ్ చేయడం, ఆమె ఆది కాలిపై కూర్చుని లేవకపోవడం, తన పంచులు, మిగతా వారి రియాక్షన్స్, మధ్యలో ఇంద్రజ కామెంట్స్, చిరంజీవి ‘అన్నయ్య’ మూవీలోని సాంగ్‌కి పర్ఫార్మ్ చేసిన ఆది, సౌమ్య రావ్‌ల కెమిస్ట్రీ.. ఇలా అంతా హ్యాపీగా జరిగిపోతుండగా.. ఓ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి తెలిసి అంతా షాక్ అయ్యారు.
ఆది, సౌమ్య రావ్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటో ఫ్రేమ్ కట్టి ఇచ్చాడు. అలాగే మదర్ ఇమేజెస్ ప్లే చేయగా అది చూసిన సౌమ్య తల్లిని తల్చుకుని భోరున ఏడ్చేసింది. అమ్మకి తలనొప్పి రావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్తే, బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చెప్పారని, ఆమెకు తనెవరో కూడా తెలియనంతగా గతం మర్చిపోయిందని.. మూడున్నర సంవత్సరాలు అమ్మని అలా బెడ్ మీద చూశానని, దేవుడు తన తల్లికి అలాంటి దయనీయ స్థితి ఇస్తాడనుకోలేదని, అమ్మ మళ్లీ తన కడుపున పుట్టాలని కోరుకుంటున్నానంటూ కన్నీరు పెట్టింది సౌమ్య రావ్.