జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందికి మంచి గుర్తింపు లభిస్తుంది. తమకు అవకాశం వచ్చినప్పుడల్ల నిరుపించుకుంటూ.. వెళ్తున్నారు. వారిలో వర్షా కూడా ఒకరు తెలుగు బుల్లితెరపై సూపర్ క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్స్‌లో వర్ష కూడా ఒకరు.
మోడలింగ్ నుండి సినిమాల్లో అడుగుపెట్టిన వర్ష.. ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నటించింది. కానీ, సినిమాలు, సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా వచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్‌లో ఇమ్మాన్యూయేల్‌కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్‌లోనే కాకుండా అప్పుడప్పుడు తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే వర్ష తన మంచి మనసు చాటుకుంది. వాచ్ మెన్ కొడుకును చదివిస్తోంది.
ఈ క్రమంలో జబర్దస్త్ స్టేజిపై తన బేర్ వాయిస్‌తో ఎన్నో పంచులు భరించే వర్షను బుల్లితెర అభిమానులు ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. అయితే తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్షా కాసేపు సరదాగా ముచ్చటించింది. మీరు ఒక వాచ్ మెన్ కొడుకుని చదివిస్తున్నారని వార్తలు వస్తున్నాయి అవి నిజమేన అని యాంకర్ అడగగా తను మాట్లాడుతూ.. ‘అవును నిజమే ఒక అబ్బాయిని చదివిస్తున్నాను, వాచ్ మెన్ వాళ్లకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లకు చదివించే స్తోమత లేక ఒకరినే చదివిస్తున్నారనే విషయం తెలిసింది. ఆ తర్వాత నేను వాళ్లకు చెప్పాను మీ అబ్బాయిని నేను చదివిస్తాను. ఎంత ఖర్చయిన పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పాను.
అప్పుడు వాళ్లు చాలా సంతోషపడ్డారు. వాళ్లది కొంచెం పేద కుటుంబం. నా వంతుగా నాకు ఉన్నదాంట్లో ఏదో చిన్న సహాయం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన మంచి పనికి కొందరు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. నేను షూటింగ్‌కి వెళ్లి అలసిపోయి వస్తాను. ఆ పిల్లాడు నా దగ్గరికి మేడమ్, మేడమ్ అంటూ నాదగ్గరకు వస్తాడు. బాబును చూసిన ఆనందంలో నా భాదలన్నీ మర్చిపొతాను. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ హాపీగా ఉంది. అని చెప్పుకొచ్చింది. ఇక మీకు సినిమా అవకాశం వస్తే ఎవరితో చేస్తారు. అని యాంకర్ అడగగా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ గారికి సిస్టర్‌గా చేస్తాను. లవర్‌గా అయితే అల్లు అర్జున్ గారితో చేయడం ఇష్టం అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.