ఎప్పుడూ నవ్విస్తూ.. హుషారుగా ఉండే శేఖర్ మాస్టర్ ఢీ స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా షో మెుత్తం ఎమోనషల్ గా మారింది.
బుల్లి తెరపై ప్రోగ్రామ్స్ అంటే వినోదంతో పాటుగా కాస్త భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఎప్పుడూ నవ్వించే ప్రయత్నం చేసినా.. కొన్ని సార్లు ఏడిపించేస్తారు మేకర్స్. చాలా ప్రోగ్రామ్స్ లో ఇవి మనం చూసే ఉంటాం. అలాంటి సంఘటనే ఢీ షోలో ఒకటి జరిగింది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారమవుతున్న షో “ఢీ 15”. శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ ఢీ షోలో ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ హుషారుగా, నవ్విస్తూ ఉండే శేఖర్ మాస్టర్.. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చి ఏడ్చేశాడు. అసలు శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?
ఈటీవీ లో గత ఎన్నో ఏళ్లుగా “ఢీ” షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ మాత్రమే ఉండే ఈ షోలో ఇటీవలే కామెడీతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటున్న ఈ షో.. ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఢీ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగానే కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ప్రదర్శనతో, కామెడీతో ఆకట్టుకోగా..చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్ నవీన్ ఒక స్కిట్ తో కూడిన డ్యాన్స్ వేసాడు. తండ్రి సెంటిమెంట్ తో సాగే ఈ పాటలో నవీన్ ప్రదర్శన అందరిని కాస్త ఎమోషనల్ కి గురి చేసింది.
ఇక ఈ పాటలో పూర్తిగా లీనమైపోయిన శేఖర్ మాస్టర్.. తన తండ్రిని తలుచుకొని ఏడ్చేశాడు. తండ్రి ఉన్నప్పుడే బాగా చూసుకోండి అంటూ.. యాంకర్ ప్రదీప్ ని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో మరో జడ్జీగా వ్యవహరిస్తున్న శ్రద్ధాదాస్, యాంకర్ ప్రదీప్ కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. ఎప్పుడూ ఆనదంగా సందడి చేస్తూ కనిపించే శేఖర్ మాస్టర్ ఇలా ఏడుస్తూ కనిపించడం ప్రేక్షకుల హృదయాన్ని కదిలించింది. మరి ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడాలంటే వచ్చే బుధవారం వరకు ఆగాల్సిందే.