గురువు రాకేష్ మాస్టర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్తూ ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘మాస్టర్ పైనుంచి మమ్మల్ని బ్లెస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
టాలీవుడ్ ఇటీవల ఓ మంచి డ్యాన్స్ మాస్టర్‌ను కోల్పోయింది. ఆయనే రాకేష్ మాస్టర్. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన అధికంగా మద్యం సేవించడంతో పాటు ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై చనిపోయారు.
ప్యాన్ ఇండియా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడన్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి మధ్యా అనుకోని కారణాల వల్ల గొడవలు జరిగాయి.
రాకేష్ మాస్టర్ మరణవార్త తెలియగానే కొందరు సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. ఈ విషయం తెలియడంతో ఆయన శిష్యుడైన శేఖర్ మాస్టర్ సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. రాకేష్ మాస్టర్ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు.
శేఖర్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయాడు. శ్రద్ధా దాస్ తో కలిసి రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులేశాడు. అయితే అవి కాస్త మోతాదుకి మించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి ఆదిని కుమ్మేశారు.
బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో 'బిగ్ బాస్ జోడి' ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఎట్టకేలకు ఫినాలేకి దగ్గర పడింది. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పటిదాకా బిగ్ బాస్ లో జరిగిన ఆరు సీజన్లను ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. కాగా.. అదే బిగ్ బాస్ షోలో సీజన్లవారీగా పాల్గొన్న కంటెస్టెంట్స్.. జోడిగా మారి ఇప్పుడు బిగ్ బాస్ జోడి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలపై అభిమానులకు క్రష్ ఉండటం మామూలు విషయమే. అయితే సెలబ్రిటీలకు సెలబ్రిటీలపై క్రష్ ఉండటం కాస్త ఆసక్తికరమైన విషయం. ఇక సదరు వ్యక్తిపై ఉన్న ప్రేమను సినిమా ఫంక్షన్స్ లోనో లేదా ఇంటర్వ్యూల్లోనో, పలు షోల ద్వారానో మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంటారు. తాజాగా యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ ను బయటపెట్టారు హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. అదీకాక ఈ క్రష్ భవిష్యత్ లో ఎలా మారుతుందో చూడాలని ఆడియన్స్ లో ఆలోచనలో […]
రెండు తెలుగు రాష్ట్రాలని గత 15 సీజన్లుగా అలరిస్తోన్న ఏకైక డ్యాన్స్ షో ‘ఢీ’. మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటకి వెలికి తీసి.. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో మల్లెమాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటోంది అనడంలో సందేహం లేదు. ఇక 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఢీ డ్యాన్స్ షో.. 15 వ సీజన్ లో కూడా దుమ్మురేపుతోంది. ”ఢీ-15 ఛాంపియన్ బ్యాటిల్” పేరుతో ప్రస్తుత సీజన్ అలరిస్తోంది. ఇక ఈ షోకు గణేష్ […]