ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానులు అందోళన చెందుతున్నారు. ప్రముఖ నటీనటులు వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోతుంది.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. కొంతమంది వయోభారంతో మరికొంతమంది గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు పాల్పపడటంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటుడు నటుడు పంకజ్ త్రిపాఠి తండ్రి పండిట్ బనారస్ తివారీ (99) సోమవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఓ షూటింగ్ లో ఉన్న పంకజ్ త్రిపాఠీ తన తండ్రి మరణ వార్త తెలియగానే బీహార్ గోపాల్ గంజ్ లోని తన నివాసానికి బయలుదేరారు. గతంలో పంకజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా నాన్న 90 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, ఇండస్ట్రీలో నేను ఏం చేస్తున్నానో మా నాన్నకు ఇప్పటికీ తెలియదు. ఆయన నా విసయాల గురించి పెద్దగా గర్వపడరు.. నేను ఏ సినిమాల్లో నటించాను, ఎలా చేస్తాను అన్న విషయం ఆయనకు తెలియదు. ఆయనకు ఇప్పటి వరకు సినిమా థియేటర్ లోపల ఎలా ఉంటుందో తెలియదు అంటే అందరూ ఆశ్చర్యపోతుంటారు. మా ఇంట్లో టీవిలో చూపిస్తే నన్ను చూసేవారు అని అన్నారు.
గతంలో నేను కొత్తగా కట్టుకున్న ఇంటి గృహప్రవేశానికి ముంబాయి వచ్చారు. 2004లో రన్, ఓంకార మూవీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పంకజ్ త్రిపాఠి. 60 టెలివిజన్ షోలలో పని చేశాడు. 2012లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ వెబ్ సిరీస్‌లో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు మీర్జాపూర్ వెబ్ సీరీస్ లో పంకజ్ త్రిపాఠీ కి బాగా పేరు వచ్చింది. తెలుగు లో మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా మూవీలో నటించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి OMG 2లో నటిస్తున్నారు పంకజ్ త్రిపాఠీ. ఆయన తండ్రి మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
Pankaj Tripathi’s father, Pandit Banaras Tiwari, passed away today at the age of 99
“His last rites will be performed today amongst his close family. Pankaj Tripathi is currently on his way to his village in Gopalganj,” the actor’s team said in a statement pic.twitter.com/heXfieXsYB
— BombayTimes (@bombaytimes) August 21, 2023