ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారి రీల్స్ నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు.
ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారి రీల్స్ నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ సినిమా కోసం హీరోయిన్, డ్యాన్స్ మాస్టర్ కలిసి చిందులేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ వారిద్దరు ఎవరు అనుకుంటున్నారా.. తెలుగులో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం దక్కించుకుంది.
తాజాగా నితిన్‌తో ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్’ షూటింగ్‌లో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి “డేంజర్ పిల్ల” అనె మెలోడి పాటను రిలీజ్ చేశారు. పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో కొందరు నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు. ఈ పాట అందరిని అకట్టుకోవడంతో సెలబ్రిటీలు సైతం ఈ పాట మీద రీల్స్ చేస్తు సందడి చేస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్, శ్రీలీల కలిసి డేంజర్ పిల్ల పాటకు రీల్ చేశారు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌లో శేఖర్ మాస్టర్, శ్రీలీల గ్రేస్ మూమెంట్స్‌తో అందరిని అకట్టుకుటున్నారు. శ్రీలీల మాస్టర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా చాలా స్టైల్‌గా చేస్తుంది. ఫ్యాన్స్ మాత్రం డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. కొందరైతే శేఖర్ మాస్టర్‌ను డామినేట్ చేశావ్ కదా అంటున్నారు. మరి కొందరు మీరు కూడా కొరియోగ్రాఫర్ అయిపొవచ్చు అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. మరో విశేషం ఏంటంటే “డేంజర్ పిల్ల” పాటకి కొరియోగ్రఫి చేసింది శేఖర్ మాస్టరే.
ఇక శేఖర్ మాస్టర్ విషయానికొస్తే తెలుగులో ఉన్న అందరి హీరోలతో పనిచేశాడు. గ్రేస్ మూమెంట్స్, సిగ్నేచర్ స్టెప్స్ చేయడంలో శేఖర్ మాస్టర్ తర్వాతే ఎవరైన. అయన చేసిన తాజా సినిమా భోళా శంకర్ థియేటర్లలో సందడి చేస్తుంది. అందులో కొన్ని పాటలు శేఖర్ మాస్టర్ నృత్యాలు చేశాడు. చిరంజీవి గ్రేస్‌కి, శేఖర్ మాస్టర్ సిగ్నిచర్ స్టెప్స్‌కి థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక శ్రీలీల, శేఖర్ మాస్టర్ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. శ్రీలీల మొదటి సినిమా పెళ్లి సందడి, ఆ తర్వాత వచ్చిన ధమాకా వంటి చిత్రాలు వచ్చాయి. తాజాగా స్కంద, ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మేన్’ సినిమాలు ఉన్నాయి.