ఈ ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమ అభిమాన నటులు కన్నుమూయడంతో విషాదంతో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంటుంది. తమ అభిమాన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
బాలీవుడ్ నటి అంకిత లోఖండే ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే (68) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. తండ్రి మరణంతో అంకిత లోఖండే తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అంకిత తన తండ్రిని తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యింది. తన తండ్రి పాడె మోస్తూ భావోద్వేగానికి గురైంది.. ఆ సమయంలో ఆమె భర్త విక్కీ జైన్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక అంకిత లోఖండే విషయానికి వస్తే… ఇండోర్ లో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే 2005 లో ముంబైకి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించింది. ఆ సమయంలో తన తండ్రి శశికాంత్ ఆమెను బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు. టాలెంట్ హంట్ రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత పవిత్ర రిష్గా సీరియల్ నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ లో అంకితకు బాగా పేరు వచ్చింది. ఈ సీరియల్ నడుస్తున్న సమయంలోనే నటుడు సశాంత్ సింగ్ తో ప్రేమలో పడింది.. తర్వాత బ్రేకప్ చెప్పి విక్కీ జైన్ ని పెళ్లి చేసుకుంది. అంకిత మణికర్ణిక, బాఘీ 3 మూవీస్ లో నటించింది.
Ankita Lokhande ने नम आंखों से अपने पिता को कहा अलविदा, actress का रो-रोकर हुआ बुरा हाल #AnkitaLokhande #AnkitaLokhandeFatherFuneral #Filmy pic.twitter.com/bTKo6L49tF
— Filmy (@FilmyNewj) August 13, 2023